ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనూహ్యంగా అప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులపై రివర్స్ మంత్రం పఠించింది. గత చంద్రబాబు ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి.. ఎక్కువ మొత్తాలకు పనులు అప్పగించిందని.. తాము ప్రజాధనాన్ని కాపాడుతామని.. చెప్పిన సీఎం జగన్.. దాదాపు అన్ని కాంట్రాక్టు లకు రివర్స్ మంత్రం అమలు చేశారు. దీంతో కొంత మేరకు ఆయన ప్రజాధనాన్ని వెనక్కి రప్పించారు. అయితే.. ఇప్పుడు ఇదే ఆయన ప్రభుత్వంపై పగబట్టిందని అంటున్నారు పరిశీలకులు.
దీనికి కారణం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు.. ఏకమయ్యారు. అందరూ సిండికేట్ అయ్యారు. ప్రభుత్వం ఏపనిచేయాలన్నా.. కాంట్రాక్టర్లతోనే పని. అయితే.. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికే రివర్స్ దెబ్బపడింది. దీనికితోడు గత పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. ముఖ్యంగా ఇసుక రవాణా.. సహా ప్రాజెక్టులకు సంబంధించి పెట్టబడులు పెట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లు.. ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కొందరు ఇప్పటికే కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసి.. తమ సొమ్ములు రాబట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో.. కాంట్రాక్టర్లు అందరూ ఏకమై.. ప్రభుత్వ పనులు చేయరాదని.. నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా రోడ్లను బాగు చేసేందుకు జగన్ సర్కారు టెండర్లు పిలిస్తే.. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. మీరు ఇప్పటి కే ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని.. పైగా రివర్స్ అంటున్నారని ఇది మాకు నష్టాలు తెస్తోందని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారట. ముందు డబ్బులు చెల్లించాలి.
అదే సమయంలో రివర్స్ అనే మాట వినిపించకూడదని.. వారు షరతులు పెడుతున్నారట. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై జగన్ సర్కారు తలపట్టుకుంది. పోనీ.. సొంత పార్టీలోనే నేతలకు కాంట్రాక్టులు ఇద్దామని అనుకున్నా.. ప్రభుత్వం చెబుతున్న ధరలకు తాము చేసేది లేదని.. వారు కూడా మొండికేస్తున్నారట. దీంతో ఇప్పుడు.. రివర్స్.. రివర్స్ అయిందేనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి దీనిపై ఏం చేస్తారో చూడాలని అంటున్నారు సీనియర్ అధికారులు.
This post was last modified on November 21, 2021 8:39 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…