మూడు వ్యవసాయ చట్టాలు నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇపుడందరి దృష్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంపై పడింది. మూడు వ్యవసాయ చట్టాలను చేసిన తర్వాత రైతుల ఆధ్వర్యంలో ఢిల్లీ శివార్లలో గడచిన 12 మాసాలుగా ఎంత పెద్ద ఉద్యమం నడుస్తోందో అందరికీ తెలిసిందే. ఇంతకాలం చట్టాలను వెనక్కు తీసుకునేది లేదని తెగేసి చెబుతు వచ్చిన మోడి హఠాత్తుగా చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా దేశానికి ప్రత్యేకించి రైతాంగానికి, వారి కుటుంబాలకు మోడీ క్షమాపణ కూడా చెప్పారు. మోడీ ప్రకటన అన్నది కచ్చితంగా రాజకీయ అనివార్యత నేపథ్యంలో మాత్రమే జరిగిందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ మధ్య జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగలటం, తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేశారనటంలో సందేహం లేదు.
అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయాన్ని కూడా మోడీ పునరాలోచించాలంటు డిమాండ్లు మొదలయ్యాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసేదే లేదన్నట్లుగా వ్యవహరించిన మోడీ మొదటిసారి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా మోడీ వెనక్కు తీసుకోవాలని ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
లాభాల్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేకపోయినా మోడీ సర్కార్ మాత్రం హిడెన్ అజెండాతోనే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కూడా సుప్రింకోర్టులో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కేసులు నడుస్తున్నాయి.
ఒకవేళ మోడి గనుక ప్రజల ఆకాంక్షల మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంటే కేసులను విత్ డ్రా చేసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని జనాలందరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయం అంటే రాజకీయ అనివార్యత వల్ల జరిగింది. మరి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మాటేమిటి ?
This post was last modified on November 20, 2021 2:04 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…