ఔను! ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో ప్రారంభమైంది. కేంద్రంలో తనకు తిరుగులేదని.. తను తప్ప.. ఎవరూ గద్దెపై కూర్చునే పరిస్థితి లేదని.. ఈ దేశమే కాదు.. ఈ ప్రపంచం కూడా మెచ్చిన నాయకుడిని నేనే నని తరచుగా చెప్పుకొనే..చెప్పించుకునే ప్రధాని నరేంద్ర మోడీనే.. రైతుల విషయంలో దిగివచ్చారు. తానే చేసిన.. తానే పట్టుబట్టి.. తొమ్మిది మాసాలుగా.. పట్టు విడవకుండా.. ఉన్న నూతన సాగు చట్టాల విషయం లో మోడీ.. వెనక్కి తగ్గారు. రైతులదే విజయమని.. చాటి చెప్పారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి.. వారిలో పట్టుదలకు ఆయన అన్ని మెట్లు దిగి వచ్చారు. సాగు చట్టాలను వెనక్కితీసుకున్నారు. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడింది. ఇక్కడ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలం టూ.. 702 రోజులుగా అన్నదాతలు రోడ్డెక్కారు. పోలీసుల నిర్బంధాలు ఎదుర్కొన్నారు. అక్కడ ఎలా అయితే.. పంజాబ్ సరిహద్దులోని సిక్రీలో రైతులు ఉద్యమించారో.. దానికంటే ఎక్కువగా ఇక్కడ మహిళా లోకం కూడాతరలి వచ్చింది. రైతులు.. మహిళలు.. యువత, విద్యావంతులు.. ఇలా అన్ని వర్గాల వారు.. కూడా రోడ్డెక్కారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దీక్షలు చేశారు. నిరసనలకు దిగారు. ప్రభుత్వంపై ఉద్యమించారు. ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారు.
తాజాగా ఈనెల 1 నుంచి మహాపాదయాత్ర నుచేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు , వరదలను కూడా లెక్క చేయకుండా వారు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. మూడుతో ఒరిగేది ఏమీలేదని తేల్చిచెబుతున్నారు. ఇదే విషయంపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయినప్ప టికీ.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతి చూపించలేదు. పైగా అవహేళనలు పెరుగుతున్నాయి. అయితే..రోజులు అన్నీ కూడా ఒకేలా ఉండవు కదా! ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
అంత పెద్ద కేంద్ర ప్రభుత్వమే రైతుల విషయంలో వెనక్కి తగ్గింది. మళ్లీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే.. రైతుల శరణు జొచ్చాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలోనూ పరిణామాలు మారతాయనే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో సంఖ్యాబలం వైసీపీకి ఉన్నప్పటికీ.. ఓట్ల పరంగా చూసుకుంటే.. ఆ పార్టీకి వ్యతిరేకత ప్రారంభమైంది. ఇది ఖచ్చితంగా అమరావతి రైతుల ప్రభావంతో పాటు.. జగన్ పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా దిగిరాక తప్పదనే అంటున్నారు పరిశీలకులు. అయితే.. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 19, 2021 12:19 pm
హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…
సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్‌లోనే అలాంటి వీడియోలు…
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…