టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం.. ఇప్పుడు పోలీసుల ఆంక్షలు.. అధికార పార్టీ నేతల దూకుడు.. విపక్ష నేతల.. భయాందోళనలతో కుతకుత ఉడుకుతు న్న పరిస్థితి కనిపిస్తోంది. పైగా మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. పులివర్తి నాని.. వంటివారిని పోలీసులు గృహ నిర్బంధం చేయడం.. కూడా సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బందీ లేని.. ఈ నియోజకవర్గంలో ఒక్కసారిగా ఇలాంటి పరిణామాలు వెలుగు చూడడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. అయితే.. దీని వెనుక అసలు ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో.. అధికార, విపక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. నువ్వా.. నేనా అనే రేంజ్‌లో ఇక్కడ పోటీ నెలకొంది. మొత్తం 54 డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో టీడీపీ హవాను తగ్గించడమే ధ్యేయంగా.. వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల నిర్వహణవరకు కూడా పెద్దిరెడ్డి అన్నీ తానై.. ముందుకు సాగుతున్నారు. దీంతో టీడీపీ నేతలను.. ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా 8 డివిజన్లలో ఏకగ్రీవం చేసుకున్నారు.
అయితే.. 14 వ డివిజన్ వ్యవహారం.. రచ్చకు దారితీసింది. ఇక్కడ టీడీపీ తరఫున ఎస్సీ వర్గానికి చెందిన వెంకటేష్.. అనే వ్యక్తి దాఖలు చేశారు. అయితే.. ఈ క్రమంలో ఇతని నామినేషన్లు లాక్కుని.. చింపేసి.. వైసీపీ నాయకులు నానా హడావుడి సృష్టించారు. అయితే.. దీనికి ముందే.. ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రకాశ్ నామినేషన్ వేశారు. ఒకవేళ ప్రకాశ్‌ను తిరస్కరిస్తారేమో.. అని భావించి.. వెంకటేష్..తోనూ.. ఇక్కడ నామినేషన్ వేయించారు. అయితే.. అనూహ్యంగా వెంకటేష్‌ను తిరస్కరించిన.. అధికారులు.. ప్రకాశ్ నామినేషన్‌ను ఓకే చేశారు. ఇంత వరకు కథ ఇలా ఉంటే.. ఆ తర్వాత అనూహ్యంగా మలుపు తిరిగింది.
14వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు.. సోమవారం పొద్దు పోయాక.. అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో అలజడి రేగింది. ఏం జరిగిందా? అని చూస్తే.. ప్రకాశ్.. నామినేషన్‌ను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. దీంతో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. దీనికి సంబంధించి 19 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హోటల్లో భోజనం చేస్తున్న అమరనాథ్‌రెడ్డిని, పులివర్తి నానిని బలవంతంగా వాహనాలు ఎక్కించి తీసుకెళ్లారు.
ఇతర ప్రాంతాల నాయకులైన వీరిద్దరితో పాటు వేరే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్సీ దొరబాబుకు 41ఏ నోటీసులు ఇచ్చి, అరెస్టు చేసి వారి సొంత ప్రాంతాలకు తరలించారు. అయితే.. ఇప్పుడు.. ఏకంగా..వారిని అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ వివాదంపై జోక్యం చేసుకున్న చంద్రబాబు.. అక్రమ అరెస్టులు.. గృహ నిర్బంధాలపై.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డీజీపీ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కూడా లేఖలు రాశారు. మరోవైపు.. గృహ నిర్బంధంలో ఉన్న నిమ్మల రామానాయుడు, పులివర్తి నాని, మాజీ మంత్రి అమర్నాథ్‌లు.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేశారు.
This post was last modified on November 10, 2021 3:43 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…