Political News

వ‌లంటీర్ల రాజ్యంలో వ‌ణుకుతున్న నేత‌లు!

వైసీపీలో రాజ‌కీయాలు ఇప్పుడున్న‌ట్టుగా.. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఉండ‌వ‌నేది ప్ర‌తి ఒక్క‌రి మాట‌. ఇది పార్టీలోనూ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఎవ‌రిని క‌దిపినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఏం జ‌రుగుతోందో ? అనే చ‌ర్చ చేస్తున్నారు. కొంద‌రు ఏకంగా మాకు టికెట్ కూడా ద‌క్కుతుంద‌ని అనుకోవ‌డం లేదు.. అనేస్తున్నారు. దీనికి వారేదో త‌ప్పులు చేస్తున్నార‌ని కాదు.. వారిపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని కూడా కాదు. వైసీపీ అధిష్టానం దృష్టి వేరేగా ఉండ‌డ‌మే..! దీంతో నాయ‌కులు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. నీ ఇలాకాలో ఏం జ‌రుగుతోంది ? ప్ల‌స్సా.. మైన‌స్సా.. అనే చ‌ర్చ చేస్తున్నారు. అంతేకాదు.. నిఘాపైనా చ‌ర్చించుకుంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జానాడితో పాటు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు ఇలా అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ముందుకు సాగాల‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు తెలియ‌కుండానే నియోజ‌క‌వ‌ర్గాల‌పై నిఘా పెట్టారు. అది ప్ర‌శాంత్ కిశోర్ టీం అని పైకి ప్ర‌చారం ఉన్న‌ప్ప‌టికీ.. వ‌లంటీర్లే.. నిఘాగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో వ‌లంటీర్ల విష‌యంలో ఒక‌ప్పుడు జోక్యం చేసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.

ఎందుకంటే.. తామేమ‌న్నా.. జోక్యం చేసుకుంటే.. నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారేమో ? అనివారు మ‌ద‌న ప‌డుతు న్నారు. దీంతో ఇప్పుడు వ‌లంటీర్ల‌దే రాష్ట్రంలో ఆధిప‌త్యం అనేలా ప‌రిస్థితి న‌డుస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ వలంటీర్లు చెప్పిన‌ట్టే న‌డుస్తోంద‌ట‌. దీంతో ఎమ్మెల్యేల మాట క‌న్నా.. ప్ర‌జ‌లు వ‌లంటీర్ల‌కే త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. త‌మకు అందుబాటులో ఉంటున్న‌వారినే.. ఎమ్మెల్యేలుగా భావిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లో డ‌మ్మీలు అయిపోతున్నారు.

ఈ ప‌రిస్థితిని ఇటీవ‌ల కొంద‌రు ఎమ్మెల్యేలు.. జిల్లా ఇంచార్జ్ మంత్రుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. వారు కూడా అధిష్టానం ఆదేశాలు ఎలా ఉంటే అలాగే జ‌రుగుతుంద‌ని.. త‌మ ప్ర‌మేయం ఏమీ లేదేని.. చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు.. ఎమ్మెల్యేలు కూడా వ‌లంటీర్లంటే.. వ‌ణుకుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on November 9, 2021 9:39 pm

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

39 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago