కొన్నిసార్లు సరదాగా అనే మాటలే చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. కేసుల వరకు తీసుకెళ్తుంటాయి. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అలాంటి మాటతోనే వివాదంలో చిక్కుకున్నాడు. పోలీస్ కేసు ఎదుర్కొంటున్నాడు.
అతను తన మాజీ సహచరుడు, స్నేహితుడు అయిన టీమ్ ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఉద్దేశించి ఓ ఆన్ లైన్ చాట్ కార్యక్రమంలో ఉపయోగించిన ‘భాంగి’ అనే పదం వివాదానికి దారి తీసింది. ఆ పదం దళితుల్ని కించపరచడానికి ఉపయోగిస్తారని.. చాహల్‌ను ఉద్దేశించి ఆ పదం వాడటం ద్వారా తమ కులాన్ని అతను కించపరిచాడని హరియాణాకు చెందిన దళిత హక్కుల నేత, న్యాయవాది రజత్ కలశన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల యువరాజ్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ప్రోగ్రాం నిర్వహించాడు. ఈ సందర్భంగా భారత స్పిన్నర్లు చాహల్, కుల్‌దీప్‌ల గురించి మాట్లాడాడు. అందులో భాగంగా చాహల్ గురించి స్పందిస్తూ ‘భాంగి’ అనే పదాన్ని వాడాడు యువీ. దీనికి బదులుగా రోహిత్ శర్మ నవ్వాడు. అది ట్విట్టర్లో వివాదంగా మారింది. యువీ దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడంటూ అతణ్ని ట్రోల్ చేశారు.
దీనిపై ఇప్పుడు దళిత హక్కుల నేత రజత్ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువీ తప్పు మాట మాట్లాడాడని.. రోహిత్ శర్మ దాన్ని ఖండించకుండా నవ్వాడని.. ఇది దళితుల సెంటిమెంటును గాయపరిచిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ చర్చకు సంబంధించిన సీడీలు, వివరాలను పోలీసులకు ఆయన అందేశారు. ఈ కేసు విచారణను డీఎస్‌పీకి అప్పగించామని.. యువీ తప్పు చేశాడని తేలితే తగు చర్యలు చేపడతామని హన్సి ఎస్పీ లోకేంద్ర సింగ్ తెలిపారు.
This post was last modified on June 5, 2020 12:21 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…