క్షేత్రస్ధాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎంతో ప్రిస్టేజియస్ గా తీసుకున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవటమే కేసీయార్ కు పెద్ద దెబ్బ. ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టాలని ప్రలోభాలు, ఒత్తిళ్ళు, బదిలీలు, పంపిణీలు, పదవులు, పథకాలు ఎన్ని ప్రకటించినా చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. అంటే కేసీయార్ మాటలను జనాలు నమ్మటం మానేయటమే కాకుండా తమలోని వ్యతిరేకతను ఈటలను గెలిపించటం ద్వారా స్పష్టం చేసినట్లు అర్ధమవుతోంది.
ఇంకా ఓటమి బాధనుండే బయటపడలేక నానా అవస్తలు పడుతుంటే ఉద్యోగాల భర్తీకి ఉద్యమం పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొందరలోనే పెద్ద ఉద్యమం మొదలవ్వబోతోంది. 20 విద్యార్ధి సంఘాలు ఉద్యోగాల భర్తీకి పెద్ద ఉద్యమం చేయాలని చేతులు కలిపి జాయింట్ యాక్షన్ కమిటిగా ఫాం అయ్యాయి. ఉద్యమాలకు తెలంగాణాలో ఉస్మానియా విశ్వవిద్యాలయమే కేంద్రమని అందరికీ తెలిసిందే.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి కూడా ఊపు తెచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయమే. కేసీయార్ నిరాహార దీక్షను విరమించి మళ్ళీ వెంటనే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. ముందు దీక్షను విరమించి తర్వాత వెంటనే మొదలుపెట్టడంలో ఉస్మానియా విద్యార్ధుల స్పందనే ప్రధాన కారణం. అందుకనే రాజకీయ నేతలకు ఓయూ అంటేనే హడలని చెప్పాలి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రయిన ఏడేళ్ళల్లో కేసీయార్ ఒక్కసారి కూడా ఉస్మానియా క్యాంపస్ లోకి వెళ్ళలేదు.
ప్రభుత్వానికి ఒక విధంగా టెర్రర్ గా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొందరలోనే ఉద్యమం మొదలవ్వబోతోంది. నిరుద్యోగ సైరన్ కు విద్యార్ధిసంఘాలు కసరత్తు మొదలుపెట్టాయి. ఉద్యోగల భర్తీపై కేసీయార్ నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని విద్యార్ధి సంఘాల సమావేశం తాజాగా నిర్ణయించాయి. అప్పట్లో తెలంగాణా కోసం యావత్ విద్యార్ధి లోకం ఎలా స్పందించిందో ఇపుడు కేసీయార్ ను గద్దె దింపటం కోసం ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటి ప్రకటించింది.
ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీకి కేసీయార్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందని ఎదురుచూసిన వారికి నిరాసే ఎదురయ్యింది. అసలు తెలంగాణా ఉద్యమం మొదలైందే నీళ్ళు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నినాదాలపై. నీళ్ళు, ఆత్మగౌరవం సంగతి దేవుడెరుగు నియామకాలు మాత్రం గాలికిపోయాయని విద్యార్ధి సంఘాలు మండిపోతున్నాయి. కేసీయార్ అధికారంలో ఉన్నంతవరకు ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని విద్యార్ధిసంఘాలు ఇఫ్పటికే డిసైడ్ అయిపోయాయి. అందుకనే కేసీయార్ ను గద్దె దింపటమే ఏకైక టార్గెట్ గా ఉద్యమం మొదలవ్వబోతోంది. జరుగుతున్నది చూస్తుంటే కేసీయార్ కు బ్యాడ్ టైం స్టార్టయ్యిందా అనే అనుమానం మొదలవుతోంది.
This post was last modified on November 6, 2021 12:06 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…