Political News

నేనా బంకర్‌లో దాక్కోవడమా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ఏ స్థితిలోనూ వెనక్కి తగ్గే రకం కాదు. కింద పడ్డా తనదే పైచేయి అంటాడు. ఎప్పుడూ దూకుడుగా మాట్లాడతాడు. దూకుడుగానే వ్యవహరిస్తాడు. అలాంటి వ్యక్తి అమెరికాలో నల్ల జాతీయుల నిరసనలకు భయపడి వైట్ హౌస్‌ను ఖాళీ చేసి దానికి అనుబంధంగా ఉన్న బంకర్‌లో దాక్కున్నట్లుగా వార్తలు వచ్చాయి. అమెరికా అధికార వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. వైట్ హౌస్‌కు అతి సమీపంలో ఆందోళనలు జరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా భద్రత అధికారులు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని బంకర్‌లోకి తీసుకెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇలా బంకర్‌లోకి వెళ్లడం మామూలే.

ఐతే ట్రంప్ ఇలా బంకర్లో‌కి వెళ్లిన విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. తాను బంకర్‌లోకి వెళ్లిన మాట వాస్తవమే అంటూనే.. అక్కడికి వెళ్లింది దాక్కోవడం కోసం మాత్రం కాదని చెప్పాడు. ‘‘నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండు మూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. నేను బంకర్లోకి వెళ్లడం గురించి ఏమేం రాశారో మీడియాలో చదివాను. బంకర్‌ను పరిశీలించడానికే వెళ్లాను. దాక్కోవడానికి కాదు. అక్కడికి వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అమెరికా అధ్యక్షుడినైన నా దగ్గరికి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు’’ అని ఓ న్యూస్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో శ్వేత సౌధంపై జరిగే దాడుల నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ రక్షించేందుకు ఈ బంకర్‌ను నిర్మించారు. ఇది శ్వేత సౌధంలో ఎక్కడ ఉందనే విషయం సీక్రెట్‌. వైట్‌హౌస్‌ మిలటరీ ఆఫీస్‌ సిబ్బంది దీని నిర్వహణ చూస్తుంటారు. 2001 సెప్టెంబర్‌ 11 ట్విన్‌ టవర్స్‌పై దాడులు జరిగిన సమయంలో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ ఇందులో తలదాచుకున్నారట. ఆ తర్వాత బంకర్‌ను ఉపయోగించింది ట్రంప్‌‌యే అంటున్నారు.

This post was last modified on June 5, 2020 2:16 am

Share

Recent Posts

అలక వీడిన కోమటిరెడ్డి?

సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న…

1 hour ago

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

3 hours ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

6 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

6 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

7 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

8 hours ago