తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎన్నో ఆశలతో ఉన్న అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఎదురు దెబ్బ తగులుతుందని పరిశీలకులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పోటెత్తారు. ఏపీలోని బద్వేల్‌పై కన్నా.. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికపై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. హుజూరాబాద్ఉప ఎన్నికలో.. బీజేపీ అభ్యర్తిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు సానుభూతి పవనాలు జోరుగా వీచాయని చెబుతున్నారు. వ్యక్తిగతంగా మంచి పట్టున్న నాయకుడు.. ఉప ఎన్నికకు ముందు పాదయాత్ర కూడా చేసిన నాయకుడుగా ఈటల రాజేందర్ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని పరిశీలకులు తేల్చశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్నిక ముగిసే సమయానికి 79 శాతం ఓటింగ్ జరిగింది. దీనిని ప్రభుత్వ వ్యతిరేక ఓటు గానే పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఈటలకు కలిసి వచ్చిన పరిణామంగా చెబుతున్నారు. దళిత బంధు సహా అనేక పథకాలు చేపట్టినా.. అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరకపోవడం.. టీఆర్ ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలిందని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచిందని.. అంటున్నారు. అదేసమయంలో సానుబూతి ఈటలకు అస్త్రంగా మారిందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఈటల గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని.. చెబుతున్నారు. ఏపీలోని బద్వేల్లో వైసీపీ విజయం దక్కించుకుంటుందని.. పరిశీలకులు చెబుతున్నారు. ఇంటింటికీ తిరిగి.. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతోపాటు.. జగన్‌పై ఉన్న అభిమానం.. ఇక్కడ ఓట్ల రూపంలో పడిందని అంటున్నారు..
తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ రెండు నియోజకవ వర్గాల్లోనూ.. ఆశించిన విధంగా పోలింగ్ సాగింది. బద్వేల్‌లో 60.5 శాతం.. హుజూరాబాద్‌లో 79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్ల నాడి.. ఏంటనేది.. ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక, ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం దక్కించుకుంటుందనే విషయంపై సర్వేలు తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజా పరిణామాలను పరిశీలించిన విశ్లేషకులు.. బద్వేల్‌లో దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి సుధపై సానుభూతి పవనాలు జోరుగా వీచాయని అంటున్నారు.
పైగా ఇక్కడ పోలింగ్ శాతం తగ్గడం.. వైసీపీకి కలిసి వచ్చిందనే అంటున్నారు. అంతేకాదు.. ప్రధాన పార్టీలు.. పోటీలో లేక పోవడం.. బీజేపీ ఇక్కడ పోటీ చేసినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం వంటివి వైసీపీకి కలిసి వచ్చిందని.. చెబుతున్నారు. ఈ పరిణామాలను అంచనా వేస్తున్న పరిశీలకులు.. బద్వేల్ లో వైసీపీ విజయం దక్కించుకుంటుందని చెప్పేస్తున్నారు. అయితే.. మెజారిటీ 50 వేలలోపే ఉండే అవకాశం ఉంటుందని.. వైసీపీ అంచనా వేసుకున్నట్టు.. లక్ష మెజారిటీ రాదని.. పోలింగ్ సరళిని గమనించిన వారు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా.. తెలంగాణ ప్రభు్త్వానికి భారీ దెబ్బ తగులుతుందని.. అంటున్నారు. మరి వాస్తవ ఫలితాలు.. నవంబరు 2న వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 31, 2021 8:36 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…