Political News

బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్ ?

టీమిండియా మాజీ క్రికెటర్‌, తెలుగు తేజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి క్రికెట్ ప్రేమికులకు, క్రీడాకారులకు పరిచయం అక్కర లేదు. భారత జట్టులో చాలాకాలం పాటు కీలక ఆటగాడిగా కొనసాగిన లక్ష్మణ్…ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు చరిత్రాత్మక విజయాలనందించాడు. ఆసీస్ పై టెస్టులో జట్టు ఫాలో ఆన్ ఆడుతున్న క్లిష్ట సమయంలో ఈ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ తన సొగసరి షాట్లకతో చేసిన డబుల్ సెంచరీ చరిత్ర పుటల్లో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచి పోయింది.

2012లో అంతర్జాతీయ క్రికెంట్ కు వీడ్కోలు పలికిన ఈ హైదరాబాదీ స్టైలిష్ క్రికెటర్ ఆ తర్వాత…ఐపీఎల్‌ లో హైదరాబాద్ డెక్కన్‌ చార్జర్స్ సారథిగా, ఆటగాడిగా సేవలందించాడు. ప్రస్తుతం సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా ఉన్న లక్ష్మణ్…త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోన్న బీజేపీ పెద్దలు…లక్ష్మణ్ వంటి సెలబ్రిటీలను, క్రీడాకారులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుబెట్టిందట.

ఈ క్రమంలోనే ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నాయకులు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు, జాతీయ నేతలు…లక్ష్మణ్ తో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారట. దీంతో, లక్ష్మణ్‌ కు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అమిత్‌ షా సమక్షంలో లక్ష్మణ్‌ కాషాయ కండువా కప్పుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జీహెచ్‌ ఎంసీ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో లక్ష్మణ్‌ ను బరిలోకి దించాలని బీజేపీ నేతలు పావులు కదుపున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై బీజేపీ నేతలుగానీ, లక్ష్మణ్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, కాంగ్రెస్ నేతగా, హెచ్ సీఏ అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రాణిస్తున్నారు. మరి, లక్ష్మణ్ కూడా పొలిటిషియన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుబెడతారా? లేదా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

This post was last modified on October 27, 2021 9:17 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago