ఏపీ అధికార పార్టీ వైసీపీ.. వచ్చే రెండున్నరేళ్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుందా ? బలమైన పార్టీగా ఉన్న వైసీపీ.. మరింత బలంగా దూసుకుపోయేందుకు రెడీ అవుతోందా ? అంటే.. తాజాగా మారుతు న్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఈ ఏడాది చివరిలో అంటూ రాబోయే రెండు మాసాల్లోనే సీఎం జగన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకునే వీలుందని చెబుతున్నారు. వీటిలో ఒకటి.. మంత్రి వర్గాన్ని మార్చడం. రెండు.. అభివృద్ధి దిశగా పెద్ద ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట. మంత్రులను మార్చడంలోనూ ఏదో మార్చామన్నట్టుగా కాకుండా.. ఉన్నత చదువులు ఉన్నవారు.. యువతకు పెద్దపీట వేయడంతోపాటు.. మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేయనున్నారు.
తొలి టర్మ్‌లో మంత్రులుగా ఉన్న వారిలో ముగ్గురు, నలుగురు మినహా ఎవ్వరూ కూడా పార్టీకి, ప్రభుత్వానికి ఏ మాత్రం ఉపయోగ పడలేదు. వీరి వల్ల ఉపయోగం లేదన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి ప్రక్షాళనలో మాత్రం సమర్థులు అయిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న జగన్ అందుకు తగినట్టుగానే ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేసేశారట. దీనివల్ల రాజకీయంగా ఇక, పార్టీకితిరుగులేదనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతలా అంటే.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మార్పులు ఉంటాయని అంటున్నారు.
అదే సమయంలో జిల్లాల ఏర్పాటును కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా.. 25 నుంచి 26 వరకు పెంచుతారని అంటున్నారు. అంతేకాదు.. వీటికి కీలకమైన నాయకులు.. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, దామోదరం సంజీవయ్య వంటివారి పేర్లను పెడతారని వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. ఇది సెంటిమెంటుగా కూడా బాగా పనిచేస్తుందని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక, మరో ముఖ్య నిర్ణయం.. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షాలు.. ఏవిమర్శలైతే చేస్తున్నాయో. వాటిని పూర్తిగా పరిష్కరించడంతోపాటు.. అంతకు మించి అనే రీతిలో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించుకున్నారు.
ఇక, అదేసమయంలో ప్రజల్లోకి సీఎం జగన్ రానున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నారు. రచ్చబండ పేరుతో ఆయన కార్యక్రమాన్ని వచ్చే సంక్రాంతి నుంచి ఖచ్చితగా ప్రారంభించనున్నారని.. సంక్రాంతి పండుగను రచ్చబండలోనే జరుపుకోనున్నారని.. తెలుస్తోంది. ఫలితంగా నెలకు మూడు నుంచి నాలుగు సార్లు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా.. ప్రజల్లోనే తాను ఉండడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరి ఈ వ్యూహం విపక్షాలకు చెక్ పెడుతుందని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 27, 2021 12:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…