అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకేలో శశికళ అలియాస్ చిన్నమ్మ చిచ్చు పెట్టినట్లే ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్ శెల్వం మధ్య శశికళ విషయంలో తాజాగా విభేదాలు మొదలైనట్లుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను పార్టీలోకి చేర్చుకునే విషయమై పార్టీ తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని పన్నీర్ చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది.
అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే విడుదలైన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లక ముందు, విడుదలైన దగ్గర నుంచి పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని, పార్టీపై ఆధిపత్యం తనదే అని చిన్నమ్మ పదే పదే ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విషయం ఏమిటంటే శశికళను పార్టీ చాలా సంవత్సరాల క్రితమే బహిష్కరించింది. పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లోనే చిన్నమ్మను బహిష్కరిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది.
పార్టీ నుంచి తనను బహిష్కరించినా శశికళ మాత్రం పార్టీ తనదే అని, తానే ప్రధాన కార్యదర్శిని అంటు నానా గోల చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె పార్టీ గుర్తున్న జెండానే తన కారుపై పెట్టుకుని పర్యటనలు చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం తయారైంది. దీంతో పార్టీ నేతలంతా ఐకమత్యంగా ఉండి చిన్నమ్మను ఎదుర్కోవాలని పార్టీలోని సీనియర్లంతా నిర్ణయించారు. ఇలాంటి సమయంలోనే హఠాత్తుగా పన్నీర్ చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు.
పన్నీర్-పళని మధ్య పెరుగుతున్న విభేదాలను శశికళ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళ విభేదాలను అడ్వాంటేజ్ తీసుకుని పన్నీర్ తో శశికళ చేతులు కలిపినట్లు పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ గురించి పన్నీర్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటంటు సీనియర్లు మండిపోతున్నారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంలో పన్నీర్ కూడా సంతకం చేసిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి పార్టీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న గ్యాప్ ను చిన్నమ్మ మెల్లిగా పెంచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకుని నేతలను తన ఆధీనంలోకి తీసుకునేందుకు శశికళ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు పన్నీర్ ను దగ్గరకు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. నిజంగానే పన్నీర్ గనుక శశికళకు మద్దతుగా నిలబడితే అన్నాడీఎంకే నిలువుగా చీలిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on October 27, 2021 11:51 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…