Political News

వల్లభనేని వంశీ సెల్ఫ్ గోల్ పాలిటిక్స్

రాజ‌కీయాల్లో నేత‌లు తాము ఏం చేసినా చెల్లుతుంద‌నే కాలం చెల్లింది. నాయ‌కుల ప్ర‌తి అడుగును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఒక‌ప్పుడు.. ఇంత విస్తృత మీడియా.. సోష‌ల్ స‌మాచారం లేనిరోజుల్లో.. నాయ‌కులు ఏం చేసినా.. ప్ర‌జ‌ల‌కు తెలిసే స‌రికి స‌మ‌యం ప‌ట్టేది. అయినా.. అప్ప‌టి నాయ‌కులు హ‌ద్దుల్లో ఉండేవారు. ప్ర‌జాసేవ‌, దేశ సేవలో పొరుగు నేత‌ల‌తో పోటీ ప‌డేవారు. స‌రే! ఇప్పుడు మారిన ట్రెండ్‌లో సంపాద‌న‌లోను. అధికారంలోనూ ముందుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో ఇప్పుడు నాయ‌కులు ఏం చేస్తున్నా.. ఏం మాట్లాడినా.. ప్ర‌జ‌లకు క్ష‌ణాల్లోనే తెలిసిపోతోంది.

అదేస‌మ‌యంలో గ‌తంలోవారు అదే స‌బ్జెక్ట్‌పై ఎలా రియాక్ట్ అయ్యార‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తుకు తెచ్చు కుంటున్నారు. ఇలా.. గ‌తాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌పై నెటిజ‌న్లు భారీ ఎత్తున కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. తాజాగా వంశీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌ను తిట్టిపోశారు. టీడీపీ పార్టీ నాశ‌నం అయిపోయింద‌ని.. వృద్ధ జంబూకాల‌కు అది నిల‌యంగా మారింద‌ని నోరు పారేసుకున్నారు. వాస్త‌వానికి.. వంశీ ఇప్పుడు ఎమ్మెల్యేగా టెక్నిక‌ల్‌గా ఉన్న పార్టీ టీడీపీనే. కానీ, రాజ‌కీయంగా ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. కేవ‌లం రెండేళ్ల కింద‌ట‌లోనే.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారారు. అయితే.. ఈ స్వ‌ల్ప కాలంలోనే ఆయ‌న వైసీపీని ఆకాశానికి ఎత్తేయ‌డం.. త‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఇచ్చి.. గెలిపించిన టీడీపీని తిట్టిపోయ‌డం.. ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే వంశీపై అన్ని వైపుల నుంచి విమర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు అనుభ‌వం అంత వ‌య‌సు కూడా లేని వంశీ.. ఎందుకు ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ స‌క్తిగా.. గ‌తంలో వంశీ వైసీపీని, ఆ పార్టీ అధినేతజ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన‌ కామెంట్ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ఆ పాత వీడియోలో వంశీ ఏమ‌న్నారంటే..”జ‌గ‌న్ పారిశ్రామిక‌వేత్తే అనుకుందాం. ఆయ‌న అనేక ప‌రిశ్ర మ‌లు, కంపెనీలు పెట్టి సక్సెస్ అయ్యారు. అయితే.. 2009 త‌ర్వాత .. ఆయ‌న ఎందుకు ఒక్క కొత్త కంపెనీ కూడా పెట్ట‌లేదు! దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం నుంచి లంచాలు రాక‌పోవ‌డ‌మే. ప్ర‌భుత్వ లంచాల‌తోనే జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీలు ప్రారంభించాడు. లంచాలు రాక‌పోవ‌డంతో కంపెనీలు ఆపేశాడు. వైసీపీలోకి అన్నం తినేవారు ఎవ‌రూ వెళ్ల‌రు. అక్క‌డ ఉన్నవాళ్లు కూడా అంతే. మ‌రి ఏం తింటారో.. వాళ్లే చెప్పాలి. మేం టీడీపీలో ఉన్న వాళ్లం అంతా .. అన్న‌మే తింటా!!” అని నొక్కి వ‌క్కాణించారు. మ‌రి ఇప్పుడు ఇదే వైసీపీని భుజాన వేసుకుంటున్నారు. దీంతో వంశీ సార్‌.. మీరు ఏం తింటున్నారు? అనే ప్ర‌శ్న‌లు నెటిజ‌న్ల నుంచి జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 24, 2021 9:42 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

51 seconds ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

33 mins ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

1 hour ago

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

2 hours ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

2 hours ago

వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా…

2 hours ago