మన మీద వ్యాపారం చేసి మన దేశానికి వ్యతిరేకంగా పని చేసే శక్తులు సాయం చేసే దేశం చైనా. మన దేశంలో ఏటా ఆ దేశం లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. మనం వాడే ఫోన్ వాళ్లదే. చూసే టీవీ వాళ్లదే. తొడిగే బట్ట వాళ్లదే. ఇంకా ఎన్నో వస్తువులు చైనా నుంచే తయారై వస్తాయి. విదేశీ వస్తువుల వినియోగం ఆపి.. దేశీయ ఉత్పత్తుల్నే కొంటే మన జీడీపీ ఎంతో మెరుగవుతుందని తెలిసినా వాటిని వీడలేని బలహీనత. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఐతే నిపుణులు మాత్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇండియా నుంచి ఆదాయం పొందినా పర్వాలేదు కానీ.. మనం వాడే యాప్స్ ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇండియాను చైనా ప్రమాదంలో పడేస్తుందేమో అన్న ఆందోళన ఈ మధ్య పెరుగుతోంది. అందుకే చైనా యాప్స్ అన్నింటినీ అన్ ఇన్‌స్టాల్ చేసేయాలన్న పిలుపు వినిపిస్తోంది.
ఇందుకోసం జైపూర్‌కు చెందిన ఓ సంస్థ.. రిమూవ్ చైనా యాప్స్ పేరుతో ఒక కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ వేసుకుంటే ఫోన్లో ఉన్న చైనా యాప్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో అవసరం లేనివి అన్నీ తీసేయొచ్చు. టిక్ టాక్, షేర్ ఇట్.. ఇలా మన ఫోన్లో ఎన్నో చైనా యాప్స్ ఉంటాయి. ఐతే వాటికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ యాప్స్ కూడా వచ్చాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. జనాల్లో చైతన్యం వచ్చి వరుసగా చైనా యాప్స్‌ను డెలీట్ చేసి పడేస్తున్నారు. ఐతే ఈ విషయం తెలిసి చైనా కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. గూగుల్ మీద ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఆ సంస్థ తమ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను తొలగించింది. దీంతో చైనా యాప్‌ల తొలగింపు ఆగిపోయింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఈ యాప్ ఉందంటూ గూగుల్ కుంటి సాకు చెప్పింది కానీ.. చైనా కంపెనీల ఒత్తిడికి తలొగ్గే ఆ యాప్‌ను తీసేశారన్నది స్పష్టం.
This post was last modified on June 3, 2020 10:33 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…