ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ఎస్ సీటు టీఆర్ఎస్ గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల గెలిస్తే ఈసీటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఈటల రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాబట్టి తన ఎంఎల్ఏ సీటును తిరిగి తానే గెలుచుకున్నట్లవుతుంది. కాకపోతే బీజేపీ తరపున పోటీచేస్తున్నారు కాబట్టి కమలంపార్టీ బలం రెండునుండి మూడుకు పెరుగుతుంది.
‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు పెట్టారు’..ఇవి తాజాగా మాజీమంత్రి, హుజూరాబాద్ లో బీజేపీ తరపున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. రు. 300 కోట్లు ఖర్చుచేసిన అధికార టీఆర్ఎస్ మరో వెయ్యి కోట్లు రూపాయలు ఖర్చులు చేయటానికి రెడీగా ఉందుంటు ఈటల చేసిన ఆరోపణలు బాగా చర్చనీయాంశమైంది. నిజంగానే ఈటల చెప్పినట్లుగా అంత భారీ ఎత్తున ఖర్చు చేయటానికి ఏముంది ? ఉపఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్ గెలిచినా అటు బీజేపీ గెలిచినా జరిగేదేమీ లేదు.
అయితే గెలుపోటములు పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఉండదు లోతుల్లోకి వెళితే. ఈటల ఓటమి కేసీయార్ కు ఇజ్జత్ కు సవాలైపోయింది. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉండికూడా ఓ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయిందంటే అది కేసీయార్ కు ఎంత అవమానమో అందరికీ తెలిసందే. అందుకనే ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవటం కేసీయార్ కు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిపోయింది.
అందుకనే ఈటల చాలా యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టే ఇప్పటికే టీఆర్ఎస్ రు. 300 కోట్లు ఖర్చుపెట్టిందని, మరో వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి రెడీగా ఉందంటు ఒకటే గోల చేస్తున్నారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో ఖర్చు చేసిన 300 కోట్ల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు చేసిన ఖర్చేమో. ఈటలను ఎలాగైనా ఓడించటమే టార్గెట్ గా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మంజరుచేశారు. రోడ్లు వేయించటం, సామాజికవర్గాల వారీగా భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదలకు ముందు మంజూరు చేసిన నిధులు రు. 300 కోట్లంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక వెయ్యి కోట్ల రూపాయలంటేనే మరీ నమ్మబుద్ది కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఖర్చులు చేయటంలో ఈటల కూడా తక్కువేమీకాదు. బీసీ సామాజికవర్గం నేత అయినంత మాత్రాన ఈటలను తక్కువగా అంచనా వేసేందుకు లేదు. ఆర్దికంగా ఈటల కూడా బాగా సౌండ్ పార్టీయేనట. మొత్తానికి ఈటల చెప్పిన లెక్కలు కరెక్టేనా అనే చర్చయితే జరుగుతోంది.
This post was last modified on October 15, 2021 10:11 am
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…