రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవంటూ.. వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆసక్తిగా స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడూ.. ఆసక్తిగా కామెంట్లు చేసే బుచ్చయ్య ఈ సారి.. కూడా అంతకు మించి.. అన్న రేంజ్‌లో కరెంటు కోతల విషయంపై స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. అధికారులు ఈ విషయంలో ఆల్ ఈజ్ వెల్ అని చెబుతున్నా.. నొప్పి తెలియకుండా.. కోతలు విధిస్తున్నారు.
మరోవైపు.. బొగ్గు కొరత విషయంలో రాష్ట్రాన్ని తాము ముందుగానే హెచ్చరించామని.. అయినప్పటికీ.. రాష్ట్రం పట్టించుకోలేదని.. తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం.. సంచలనంగా మారింది. అంతేకాదు.. రాష్ట్రానికి తాము సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించి.. డబ్బులు చెల్లించాల్సి ఉందని.. పేర్కొంది. బకాయిలు ఇస్తే. తప్ప మున్ముందు.. బొగ్గును సరఫరా చేసేది లేదని.. హెచ్చరించింది. ఈ హెచ్చరికలు.. రాష్ట్ర ఆర్థిక శాఖ పరిస్థితి నేపథ్యంలో మున్ముందు రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి.
ఈ పరిణామాలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తిగా స్పందించారు. విద్యుత్ కోరత రాకుండా.. ప్రజలు.. ఇలా వ్యవహరించండి.. అంటూ.. ఫేస్‌బుక్‌లో గేదె పేడ వేస్తున్న ఫొటోను.. పోస్ట్ చేశారు. కరెంట్ కొరత లేకుండా ‘గోబర్ గ్యాస్’ ఉత్పత్తి కి సహజసిద్ధమైన స్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నారు.. అని బుచ్చయ్య వ్యంగ్యాస్త్రం సంధించారు.
అంటే.. కరెంటు కష్టాల నుంచి బయట పడేందుకు ప్రతి ఒక్కరు ఇక, ఇంటికొక గేదెను పెంచుకోవాలని.. సూచించినట్టయింది. వాస్తవానికి గతంలో గెదెలను పాల కోసం పెంచుకునేవారని.. ఇప్పుడు పేడ కోసం.. పెంచుకోవాలని.. విద్యుత్ కష్టాలు తీర్చుకోవాలని.. జగనన్న పేడ పథకంలో చేరాలని. ఆయన పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు అయిందని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on October 14, 2021 4:48 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…