Political News

లోకేష్‌కు డ్రగ్స్ దొరక్క ఎండిపోయాడు-కొడాలి నాని

మంత్రి కొడాలి నాని చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మీద తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు నాని. ఉత్తరాదిన వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడటం, అందులో ఏపీ అధికార పార్టీ వైకాపాకు చెందిన వ్యక్తులున్నట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ గట్టిగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కొడాలి నాని స్పందించారు. నారా లోకేష్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటుందంటూ ఆయన ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

“డ్రగ్స్ అందకపోయినా, లేదంటే ఎక్కువ తీసుకున్నా మనుషుల్లో అనేక రకమైన మార్పులుంటాయి. ఆ మార్పులు గనుక గమనిస్తే అలాంటి మనుషులకు ఉదాహరణ నారా లోకేష్. మూడు నెలలుగా నారా లోకేష్ అడ్రస్ లేడు. ఎక్కడో పడి ఉంటున్నాడు. దేశంలో డ్రగ్స్ దొరక్కుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిగారు, అక్కడ కేసీఆర్ గారు.. ఢిల్లీ మోడీ గారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ తీసుకునేవాళ్లు ఎంతటివారైనా తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. లోకేష్‌కు డ్రగ్స్ దొరక్క నక్క లాగా ఎండిపోయాడు. ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేది నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. డ్రగ్స్ తీసుకునేది ఆయన కుటుంబ సభ్యులు. డ్రగ్స్ కావచ్చు. వెన్ను పోటు కావచ్చు. అవినీతి కావచ్చు. ఈ దేశంలో చేసే పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉంది. ఔరంగజేబు లాంటి వెధవ్వి నువ్వు అని ఎన్టీఆర్ చెప్పిన మాటల్ని అందరూ నమ్ముతున్నారు” అని కొడాలి నాని విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కమ్మరాజ్యం స్థాపించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కుట్ర పన్నుతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించడం గమనార్హం. తానూ కమ్మవాడినే అని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కమ్మవాళ్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయనన్నారు. లోకేష్ మీద నమ్మకం లేక, అతణ్ని నమ్ముకుంటే పార్టీ పనికి రాకుండా పోతుందని.. తన దత్తపుత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని.. మళ్లీ అతడితో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని.. ఆయన జనసేనను టీడీపీలో విలీనం చేసేస్తే మంచిదని నాని వ్యాఖ్యానించారు.

This post was last modified on October 10, 2021 3:38 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago