దేశ కాల పరిస్థితులను బట్టి చూస్తుంటే విద్యుత్ సంక్షోభం తప్పేట్లు లేదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచుకునే అవకాశం లేకపోవడంతో వినియోగాన్ని తగ్గిచుకోవాలంటు ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. అలాగే పరిశ్రమలకు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లో కోతలు కూడా మొదలైపోయాయి. ఈ సంక్షోభం ఏ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఒడిస్సాలో ప్రభావం మొదలైపోయింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు 175 ఉన్నాయి. వీటన్నింటికీ ప్రధానంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. కరోనా వైరస్ లాంటి అనేక కారణాలతో పై దేశాల్లో బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీని కారణంగా పై దేశాల నుండి మనకు అందాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోయింది. ఇదే కాకుండా దేశీయంగా జరిగే బొగ్గు ఉత్పత్తి కూడా మందగించింది.
ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, మరోవైపు వినియోగం పెరిగిపోవడంతో డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరిగిపోయింది. 2019లో 106.6 బిలియన్ యూనిట్లున్న విద్యుత్ వినియోగం 2021లో 125 బిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో హఠాత్తుగా బొగ్గు దిగుమతులు తగ్గిపోవటంతో సమస్యలు మొదలైపోయాయి. వెంటనే కేంద్రం సంక్షోభ నివారణ చర్యలు మొదలు పెట్టినా పెద్దగా ఉపయోగం కనబడటం లేదు.
అందుకనే ముందు జాగ్రత్తగా విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలంటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు మొదలుపెట్టాయి. ఇళ్ళల్లో అయితే సాయంత్రాలు స్వచ్చంధంగా ఎయిర్ కండీషన్ వాడకాన్ని నిలిపేయాలని చెబుతున్నాయి. పరిశ్రమల్లో, కార్యాలయాల్లో విద్యుత్ వృధాను కంట్రోల్ చేయాలంటున్నాయి. వ్యవసాయ విద్యుత్ ఎంత అవసరమో అంతే వినియోగించమంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏదోరూపంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యుత్ వినియోగం తగ్గుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఏదేమైనా తొందరలోనే విద్యుత్ సంక్షోభం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సంక్షోభాన్ని తప్పించుకునేందుకే బొగ్గు స్ధానంలో గ్యాస్ సరఫరా చేయాలంటు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. అయితే ఇది కూడా లేఖ రాసినంత తేలికకాదు. దీనికి మన వంతుగా చేయాల్సిందేమంటే అనవసరమైన విద్యుత్ వృధాను తగ్గించటమే. ఎందుకంటే విద్యుత్ వృధాను అరికట్టడం అంటే విద్యుత్ ఉత్పత్తి చేయటం లాంటిదే అన్న విషయాన్ని మరచిపోకూడదు. లేకపోతే సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయం.
This post was last modified on October 10, 2021 10:27 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…