ఆప్ఘనిస్థాన్ లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు వ్యవహారం చూసిన తర్వాత ఇవే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న దేశం ఆఫ్ఘన్ మాత్రమే. ఇలాంటి దేశంలోనే బాంబులు పేలడమంటే ఎలా అర్థం చేసుకోవాలి. మామూలుగా ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేలుస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు. కానీ ఇపుడు మాత్రం తమ దేశంలోని షియా వర్గానికి చెందిన ముస్లింలే టార్గెట్ గా బాంబులు పేల్చడం గమనార్హం.
ముస్లింల్లో సున్నీలు, షియాలు బలమైన ప్రత్యర్థి వర్గాలు. ప్రస్తుతం దేశంలో సున్ని వర్గానికి చెందిన వారిదే ఆధిపత్యం. తాలిబన్లు, హక్కాని నెట్ వర్క్ లో కూడా సున్నీలదే ఆధిపత్యం కంటిన్యూ అవుతోంది. అంటే ఒకరకంగా తాలిబన్లు, హక్కానీ నెట్ వర్కనే కాదు మామూలు జనాల్లో కూడా సున్నీ-షియా వర్గాల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతునే ఉంటాయి. ఇప్పుడు దేశంలో జరిగిందిదే. కుందుజ్ లోని గొజరే సయ్యద్ అబద్ మసీదులో శుక్రవారం ప్రార్ధనలు చేసుకుంటున్న షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొందరు బాంబు పేల్చారు. ఈ దాడిలో కనీసం 100 మంది చనిపోతే మరో 150 తీవ్రంగా గాయపడ్డారు.
బాంబు దాడిలో చనిపోయిన వారంతా షియా వర్గం వారే కాబట్టి బాంబులు పేల్చింది సున్నీ వర్గీయులే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే ఉగ్రవాద గ్రూపు ప్రకటించింది. ఐఎస్ అంటే తాలిబన్లకు బద్ధ విరోధి గా చెప్పుకోవచ్చు. నిజానికి తాలిబన్లపై తాము పై చేయి సాధించాలంటే తాలిబన్లపైన దాడులు చేయాలి కానీ ఏ పాపం తెలీని అమాయకులపైన దాడి చేయటం ఏమిటే ఐఎస్ కే తెలియాలి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే షియాలను టార్గెట్లుగా చేసుకుని ఐఎస్ గ్రూపు చాలా దాడులు చేసింది. షియాలు ఆప్ఘన్లో మైనారిటిలన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఏ విధంగా చూసుకున్నా సున్నీ వర్గానిదే ఆధిపత్యం. మరి ఈ విషయం అందరికీ ఇంత స్పష్టంగా కనబడుతున్నా ఇంకా షియాలపై దాడులు చేస్తున్నారంటే ఉగ్రవాదం అన్నది పాము వ్యవహారంలా తయారైపోయిందని అర్ధమవుతోంది. పాము కూడా ఆకలేస్తే తన పిల్లలను తానే తినేసినట్లు ఉగ్రవాదం కూడా సొంతింటికే నిప్పు పెట్టుకోవటానికి వెనకాడటం లేదని అర్ధమైపోతోంది.
This post was last modified on October 9, 2021 12:02 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…