Political News

నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు

‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా వైసీపీ నేతలపై ఓ రేంజ్లో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యల ప్రకంపనలు.. ఏపీ అధికారపార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్ల దండకాన్ని మొదలు పెట్టారు. సన్నాసి అంటూ మంత్రి పేర్ని నానిపై ఫైర్ అయిన పవన్ ను.. మంత్రులు పలువురు అంతే ఘాటుగా రియాక్టు అయ్యారు. శనివారం రాత్రి పవన్ విమర్శల ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దానికి ప్రతిస్పందనలు పెద్ద ఎత్తున ఆదివారం మొత్తం సాగాయి.

ఇలాంటి వేళ.. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ సర్కారులోని డొల్లతనాన్ని ఎత్తి చూపేలా పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. ‘ప్రజల మీద పన్నులు రుద్ది.. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు. సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవరత్నాలు’ భావితరాలకు ‘నవకష్టాలు’ అంటూ వైసీపీ సర్కారు తీరును తప్పు పట్టారు.

ఏదో ట్వీట్ చేశామంటే చేశామన్నట్లు కాకుండా.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. చేస్తున్న పనులు అంటూ ఒక లిస్టును తన ట్వీట్ కు జత చేశారు. అందులో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చర్యలుగా ఏమేం చేస్తున్నారన్న వాదనను తెలిపేలా పోస్టు ఉంది.

మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని.. నియంత్రిస్తామని చెప్పి.. మద్యంతో వచ్చే ఆదాయాల్ని సెక్యురిటీగా చూపించి రుణాలు తీసుకుంటున్నారన్నారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. ఛార్జీల భారాన్ని మోపారన్నారు. ప్రతి ఏటా 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇంతకాలానికి కేవలం 450 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేశారన్నారు. గ్రూప్ 1-2 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు కేవలం 36 మాత్రమే భర్తీ చేశారన్నారు. ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయలేదన్నారు.

అక్రమ మైనింగ్ మీద ఉక్కుపాదం మోపుతామని.. ఇసుక ధరల్ని తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇసుక తవ్వకాల్ని ప్రైవేటుకు కట్టబెట్టారన్నారు. పారదర్శక పాలనను మెరుగుపరుస్తామని చెప్పిన ప్రభుత్వం.. చివరకు జీవోల్ని పబ్లిష్ చేసే వెబ్ సైట్ ను నిలిపేశారు. బలమైన రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పి.. అసలు రాజధానే లేకుండా చేశారు. కన్ఫ్యూజన్.. కోర్టులు.. కేసులతో సరిపెడుతున్నారంటూ ట్వీట్ లో విమర్శల్ని గుప్పించారు.

This post was last modified on September 27, 2021 12:03 pm

Share
Show comments

Recent Posts

ప్రభాస్ ప్రభావం – కమల్ వెనుకడుగు

ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…

10 hours ago

ట్రెండ్ సెట్టర్ రవిప్రకాష్.! మళ్ళీ మొదలైన హవా.!

సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…

10 hours ago

శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల…

10 hours ago

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

15 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

16 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

17 hours ago