తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాలను చూస్తే కుప్పం నియోజకవర్గం కన్నా మరో 12 నియోజకవర్గాలే బెటర్ రిజల్ట్సు సాధించినట్లే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలుంటే టీడీపీ గలిచింది ముచ్చటగా మూడంటే 3 ఎంపీటీసీలు మాత్రమే అని అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలాంటి ఫలితాలు రావటం చాలా విచిత్రమనే చెప్పాలి. నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలుంటే నాలుగు జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకున్నది.
నాలుగు జడ్పీటీసీలతో పాటు ఏకంగా 63 మంది ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకోవటమంటే మామల విషయంకాదు. టీడీపీ కంచుకోట కుప్పం కోటకు భారీ బీటలు వారినట్లే అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి పంచాయితీల్లో కూడా వైసీపీ మద్దతుదారులే మొత్తం గెలుచుకున్నారు. దశాబ్దాలుగా ఎన్నిక ఏదైనా టీడీపీ అభ్యర్ధులు మాత్రమే గెలిచేవారు. అలాంటి పరిస్ధితి నుండి ఇపుడు అన్నింటిలోను తుడిచిపెట్టుకుపోవటమంటే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు అనుకోవాలి. అలాగే కుప్పం పరిస్ధితిని ఇతర నియోజకవర్గాల్లో పోలుస్తు కథనాలు వస్తున్నాయి.
కుప్పంతో పోల్చుకుంటే మరో 12 నియోజకవర్గాల్లో టీడీపీ మంచి ఫలితాలనే రాబట్టింది. అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలినే తీసుకుంటే 78 ఎంపీటీసీల్లో 4 గెలుచుకుంది. నందమూరి బాలకృఫ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురంలో 43 ఎంపీటీసీల్లో 7 చోట్ల గెలిచింది. అత్యధికంగా మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నియోజకవర్గం పొన్నూరులోని 53 ఎంపీటీసీలుంటే 12 చోట్ల గెలిచింది. తర్వాత రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులో 41 ఎంపీటీసీలకు గాను 11 చోట్ల గెలిచింది.
కుప్పంకన్నా కొన్ని నియోజకవర్గాల్లో మంచి ఫలితాలనే ఎందుకు రాబట్టింది ? ఎందుకంటే జనాలతో టచ్ లో ఉండటమే కారణంగా చెప్పుకోవాలి. జనాలంటే స్ధానిక ప్రజలే కాకుండా పార్టీలో నేతలు, కార్యకర్తలు కూడా. నిత్యం జనాల్లోనే ఉండే నేతలకు జనాలతో పాటు పార్టీలో మంచి ఇమిజి ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇక్కడ కుప్పం పరిస్దితిని గమనిస్తే నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటంచటంలేదు. కరోనా వైరస్ కారణంగా ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నారు. ఎంతో అవసరమైతే కానీ చంద్రబాబు ఇంట్లోనుండి బయటకు రావటంలేదు.
తన నియోజకవర్గంలోని నేతలను కూడా జూమ్ యాప్ ద్వారానే పలకరిస్తున్నారు. చంద్రబాబు కన్నా బావమరది కమ్ వియ్యంకుడు బాలకృఫ్ణ కూడా ఓకే అన్నట్లున్నారు. తన నియోజకవర్లో ఏడు ఎంపీటీసీల్లో గెలవటం గొప్పే. బాలకృష్ణ కూడా నియోజకవర్గంలో ఏదో చుట్టపు చూపులాగ వచ్చి వెళ్ళిపోతుంటారు. కాకపోతే బాలకృష్ణ తరపున అనేకన్నా పార్టీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు.
This post was last modified on September 22, 2021 11:05 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…