దేశంలో రెండో దఫా పాలనా పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడీ స్టయిలే వేరని అంటున్నారు .. నెటిజన్లు. తొలి ఐదేళ్ల మాట ఎలా ఉన్నప్పటికీ.. రెండో దఫా పగ్గాలు చేపట్టిన తర్వాత.. మాత్రం ఆయన చేస్తున్న సందడి.. అంతా ఇంతా కాదనే విమర్శలు వున్నాయి. ఒకప్పుడు.. అద్వానీ.. దేశం వెలిగిపోతోంది! అంటూ.. ప్రచారం చేసేవారు. అయితే.. ఇప్పుడు మోడీ.. హయాంలో అంతకు మించి! అన్న విధంగా ప్రచారం జరుగుతోంది. ఈ దేశం.. మోడీతోనే మొదలు.. మోడీతోనే.. అంతం! అనుకునే నాయకులు పెరుగుతున్నారు. దీంతో మోడీ భజన తప్ప మరోమార్గం కనిపించడం లేదు.
తొలి ఐదేళ్లలో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకుండానే ముందుకు సాగారు. అయితే.. నోట్ల రద్దు తర్వాత.. కొంత వ్యతిరేకత వచ్చినా.. సర్దుకుంది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒక మోడీ-ఒక దేశం.. అనే నినాదం ఒట్టిపోయి.. ఇప్పుడు.. ఒక మోడీ-కొన్ని వేలాలు! అనే మాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాస్తవానికి దేశంలో సంస్కరణల ప్రక్రియ ఇప్పుడు మొదలైంది కాదు. ఆర్థిక పరిస్థితుల రీత్యా.. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు.. తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం మొదలైంది. అయితే.. దీనికి కూడా కొన్ని పరిధులు.. పరిమితులు విధించుకున్నారు.
ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. సూచనలు వచ్చినా.. అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వారి సూచనల మేరకు మార్పులు చేసింది. కానీ, ఇప్పుడు మోడీ సర్కారు.. ఒక దేశం-ఒకే మాట.. అదీ తన మాటే.. అన్నవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు సహా.. అనేక సంస్థలను ఇప్పుడు ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. ఫార్మా రంగాన్ని పూర్తిగా అమ్మేశారు. అదేవిధంగా పేదలకు ఉపకరించే.. బీమా రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేశారు. ఇలా.. మోడీ.. ఒక దేశం-ఒక వేలం అనే మాటను రెండో దఫా పాలనలో పూర్తిగా అమలు చేస్తుండడం గమనార్హం.
ఇక, ఇప్పుడు హఠాత్తుగా మోడీ.. ఎందుకు వార్తల్లోకి వచ్చారు? అంటే.. తాజాగా గడిచిన నాలుగు రోజులుగా ప్రధానమంత్రి మోడీ.. పదవీ కాలంలో .. తనకు పలువురు నేతలు.. పలు దేశాలు.. దేశ ప్రజలు ముచ్చట పడి సమర్పించిన కానుకలను ఆయన వేలం వేస్తున్నారు. వీటిలో మన తెలుగమ్మాయ్.. ప్రపంచ ఛాంపియన్ సింధు ఇచ్చిన టెన్నిస్ రాకెట్ కూడా ఉంది. ఇప్పుడు వీటిని వేలం వేస్తున్నారు మోడీ. అయితే.. మోడీ వస్తువులు కొనేందుకు ఆసక్తి బాగానే ఉన్నా.. “రేటే గిట్టుబాటు” కావడం లేదట!
దీంతో ఆయన “రండి.. రండి.. నా వస్తువులు కొనండి” అని ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు.. నెటిజన్లు సటైర్లు పేలుస్తున్నారు. ఒక దేశం-ఒక మోడీ-కొన్ని వేలాలు.. అంటూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో అమ్మడానికి ఇంక ఏమీలేవని.. అందుకే తనకు వచ్చిన బహుమతులు వేలం వేస్తున్నారని.. వారు కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 21, 2021 5:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…