కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నికల హీట్ నడుస్తున్న సమయంలో.. కాంగ్రెస్ నుంచి అధికారిక టీఆర్ఎస్ కి జంప్ చేసిన నేత కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా ఎంపిక అవుతాననే నమ్మకంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ వెంటనే కొద్దిరోజుల్లోనే గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది..
తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కౌశిక్ రెడ్డి ఫైల్ విషయంపై కూడా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫైల్ నా దగ్గరే ఉందన్న గవర్నర్ తమిళిసై.. నేను ఇంకా ఒకే చెప్పలేదన్నారు..ఈ ఫైల్‌పై నాకు సమయం కావాలని వ్యాఖ్యానించారు. ఇది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ కాబట్టి… తాను స్టడీ చేస్తున్నట్టు వెల్లడించారు తమిళిసై.
అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు ఆపుతారా? అంటూ అడిగిని మరో ప్రశ్నకు స్పందిస్తూ.. మీరు ఏమైనా ఊహించుకోండి.. కానీ, నేను ఆ ఫైల్‌ను స్టడీ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో.. పాడి కౌశిక్ రెడ్డిని అసలు ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా? లేదా? అనేది టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీగా ఉన్న గోరెటి వెంకన్న గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయ్యారు. ప్రభుత్వం ఫైల్ పంపిన కొద్దిరోజులకే…గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కానీ..కౌశిక్ రెడ్డి విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది టీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కలేదు. కౌశిక్ రెడ్డి సోషల్ వర్క్ చేస్తున్నారా ? అనేది చూస్తున్నట్లు, మ్యాటర్ స్టడీ చేయడం జరగుతోందని గవర్నర్ తమిళిసై వెల్లడించడం గమనార్హం.
This post was last modified on September 8, 2021 6:21 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…