కరోనా మాయదారి ఎంట్రీతో యావత్ ప్రపంచం మారిపోయింది. కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా మారింది. అన్ని మారిపోవటం.. ప్రతి దగ్గర కరోనా ప్రభావం పడింది. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి రావటం ఉంటే.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి. నెలల తరబడి సాగుతున్న వర్కు ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సరైన వ్యాయామం లేకపోవటం.. ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా ఉబకాయం బాగా పెరిగిపోతోంది. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా.. ఫిట్ గా లేకపోవటం కంపెనీకి నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ తమ ఉద్యోగులకు తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయంగా చూసినప్పుడు జిరోదా పెద్ద కంపెనీనే కాదు. చాలా చిన్నది. అయితే.. ఆలోచనలో మాత్రం పెద్ద కంపెనీలు కూడా చేయలేని ఆలోచన చేసింది.
ఉద్యోగులు ఫిట్ గా ఉండాలని పేర్కొన్న కంపెనీ.. సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా ఉంటే ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. ఈ చాలెంజ్ ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. కరోనా.. లాక్ డౌన్.. వర్కుఫ్రం హోం తదితర కారణాలతో ఉద్యోగులు శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని.. వారి ఆహార అలవాట్లు.. జీవన విధానంలో మార్పు వచ్చిన వైనాన్ని ప్రస్తావించిన సీఈవో నితిన్ కామత్.. వారిని అందులో నుంచి బయటపడేసేందుకే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మరి.. సంస్థ విసిరిన సవాలుకు ఎంత మంది ఉద్యోగులు స్పందిస్తారన్నది ఒక ప్రశ్న అయితే.. ఇదే తీరును మిగిలిన కంపెనీలు సైతం ఫాలో కావటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on August 31, 2021 7:37 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…