Political News

ఫ‌స్ట్ టైమ్‌: కేసీఆర్ పేషీలోకి ద‌ళిత అధికారి.. హుజూరాబాద్ ఎఫెక్ట్‌?

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం.. సీఎం కేసీఆర్‌.. కొన్నాళ్లుగా ద‌ళిత జ‌పం చేస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌ను త‌న ప‌క్షానికి తిప్పుకోవ‌డం.. త‌ను దూరం చేసిన ఈట‌ల రాజేందర్ ను ఘోరంగా ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ద‌ళిత బంధు.. ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. హుజూరాబాద్‌కు ఏకంగా 2000 కోట్ల రూపాయ‌ల‌ను అభివృద్ధి కోసం కేటాయించారు. ద‌ళిత వాడ‌ల‌కు వెళ్లి(వాసాల‌మ‌ర్రి) భోజ‌నాలు చేస్తున్నారు. ద‌ళితుల కోసం ఎంతో చేస్తున్నాన‌ని చెబుతున్నారు. ఇలా.. అనేక రూపాల్లో ద‌ళితుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్‌.. అదే క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న చ‌ర్య చేప‌ట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో మొదటిసారిగా ఓ దళిత అధికారి నియమితులు కానున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దళిత బంధు’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను రాహుల్‌ బొజ్జాకు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ సభలో ప్రకటించారు. ఆయనను సీఎంఓ కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఓ దళిత అధికారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో కొలువు దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాహుల్‌ ప్రస్తుతం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత దివంగత బొజ్జా తారకం తనయుడే రాహుల్‌. 2000 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాహుల్‌, గతంలో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం సీఎంఓలో అధికారులను చూస్తే.. ముఖ్యకార్యదర్శిగా నర్సింగ్‌రావు, కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌(మిషన్‌ భగీరథ), మరో కార్యదర్శిగా వి.శేషాద్రి(రెవెన్యూ), ప్రత్యేక కార్యదర్శిగా రాజశేఖర రెడ్డి(ఎడ్యుకేషన్‌), మరో ప్రత్యేక కార్యదర్శిగా భూపాల్‌ రెడ్డి(సంక్షేమం) పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంఓలో ఒక్క దళిత అధికారిని నియమించలేదంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో విపక్షాలు, దళిత సంఘాలు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ దళిత సామాజిక వర్గానికి చెందిన రాహుల్‌ బొజ్జాను సీఎంఓలో నియమించ‌డం ద్వారా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. హుజూరాబాద్‌లో విజయం దిశ‌గా దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on August 17, 2021 7:13 pm

Share
Show comments
Published by
Satya
Tags: DalitKCR

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

24 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago