తెలంగాణా కాంగ్రెస్ లో సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మడమ తిప్పేసినట్లే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని తాజాగా ప్రకటించారు. సోనియా, రాహూల్ నాయకత్వంలో కలిసి పనిచేద్దామని తాను రేవంత్ కు సూచించినట్లు ఎంపి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సోనియా, రాహూల్ నాయకత్వంలో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడికి ఓ ఎంపి చెప్పాలా ? పీసీసీ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి సోనియా, రాహూల్ నాయకత్వంలో కాకుండా మరెవరి నాయకత్వంలో పనిచేస్తారు ?
కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొద్దామని తాను సూచించినట్లు చెప్పటం కూడా విచిత్రమే. ఎందుకంటే ఇప్పటికే ఆపనిని రేవంత్ మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేతలు పనిచేయటం కాదు ముందు కోమిటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుంది. పీసీసీ అధ్యక్షులుగా ఎవరున్నా నిత్య అసమ్మతితో పార్టీని పలుచన చేస్తున్నారనే ఆరోపణలను ఇప్పటికే బ్రదర్స్ ఎదుర్కొంటున్నారు.
రేవంత్ తో పాటు కోమటిరెడ్డి కూడా పీసీసీ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం రేవంత్ కు పగ్గాలు అప్పగించింది. దాంతో అలిగిన ఎంపి రేవంత్ పై నోరుపారేసుకున్నారు. రేవంత్ నాయకత్వంలో పనిచేసేది లేదన్నారు. భవిష్యత్తులో తాను గాంధీభవన్ గుమ్మం తొక్కేది లేదని భీషణ ప్రతిజ్ఞచేశారు. మరి ఇంతలోనే యూటర్న్ తీసుకుని రేవంత్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పటంలో అర్ధమేంటి ?
తాను రేవంత్ పై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసినపుడు మరికొందరు కూడా తనకు మద్దతుగా నిలుస్తారని కోమటిరెడ్డి ఆశించారు. అయితే తన సోదరుడు రాజగోపాలరెడ్డే మద్దతుగా మాట్లాడలేదు. ఇదే సమయంలో సీనియర్ నేతల్లో ఎవరూ ఎంపికి మద్దతుగా నిలవలేదు. ఒకసారి అధిష్టానం ఫైనల్ చేసేసిందంటే అప్పటివరకు సదరు నేతపై ఉన్న వ్యతిరేకత చాలామందిలో తగ్గిపోతుంది. ఇపుడు రేవంత్ పై వ్యతిరేకత కూడా చాలామంది సీనియర్లలో అలాగే తగ్గిపోయింది.
ఈ విషయాన్ని కోమటిరెడ్డి కూడా గ్రహించినట్లున్నారు. అందరు ఒకవైపుండి తాను మాత్రం మరోవైపుంటే ఉపయోగం లేదని ఎంపికి అర్ధమైపోయింది. అందుకనే రేవంత్ తో కలిసి పనిచేస్తానని ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే కోమిటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండ జిల్లాలో మంచిపట్టుంది. తమ జిల్లాల్లో మంచిపట్టున్న నేతలు చాలామందే ఉన్నారు. అయితే వారిని ఒక టీంగా పనిచేయించటంలోనే రేవంత్ ప్రతిభ ఆధారపడుంది. అదే గనుక జరిగితే రాబోయే ఎన్నికల్లో కేసీయార్ కు ఇబ్బందులు తప్పవనే అనుకోవాలి.
This post was last modified on August 10, 2021 12:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…