బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న నాయకుడు సోము వీర్రాజు పరిస్థితి ఏంటి? ఆయనను త్వరలోనే మార్పు చేస్తారా? ఆయన స్థానంలో వేరేవారికి పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ నేతలకు సంకేతాలు కూడా ఇచ్చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి రాష్ట్ర బీజేపీ నేతల్లో చాలా సీనియర్ అయిన.. సోము.. తన దూకుడు కారణంగా.. పార్టీలో ఒకప్పుడు ఒంటరి అయ్యారు. లేకపోతే.. దశాబ్దం కిందటే ఆయనకు పార్టీ పగ్గాలు దక్కి ఉండేవనే చర్చ ఉంది.
సొంత పార్టీలోనే అసంతృప్త నేతగా పేరు తెచ్చుకున్న ఫలితంగా.. ఆయన కీలక నేతలకు దూరమయ్యా రు. అయితే.. ఎట్టకేలకు ఏడాది కిందట.. ఆయన చేసిన ప్రయత్నం ఫలించి.. రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేతికి అందాయి. ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న నాయకుడు అనే ఒకే ఒక క్వాలిఫికేషన్ సోముకు ఏపీ బీజేపీ చీఫ్ అయ్యేలా చేసిందని అంటారు. అయితే.. ఆ తర్వాత అయినా.. ఆయన తన లోపాలను గుర్తించి.. ఉంటే.. ఇప్పుడు వినిపిస్తున్న వ్యాఖ్యలు.. వస్తున్న సంకేతాలకు చెక్ పెట్టి ఉండేవారనిసీనియర్లు వాపోతున్నారు. ముఖ్యంగా ఒంటెత్తు పోకడలు.. సోమును రాజకీయంగా సొంత పార్టీలోనేఏకాకిని చేశాయి.
అందరిదీ ఒక దారి.. తనది మాత్రం వేరే! అన్న రీతిలో సోము వ్యవహార శైలి ఉండడాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ నేతలకు సోమును దూరం పెట్టేలా చేసింది. ఎవరైనా.. పార్టీని పుంజుకునేలా చేయాలంటే.. అధికార పక్షం తప్పులను ఎత్తి చూపి.. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఘనత వహించిన సోము వీర్రాజు.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును టార్గెట్ చేయడం.. బీజేపీకి సానుకూలంగా ఉన్న కమ్మ ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీసింది. అంతేకాదు.. మేధావులు కూడా సోముకు మద్దతు పలకలేక పోయారు. అదేసమయంలో క్షత్రియులకు కూడాసోము దూరమయ్యారు.
ఒకప్పుడు పశ్చిమ గోదావరిజిల్లా క్షత్రియ సామాజిక వర్గం.. బీజేపీకి అండగా ఉండేది. అది ఇప్పుడు వైసీపీకి బలంగా మారింది. ఇక, తన సొంత సామాజిక వర్గం కాపుల్లోనూ సోము సింపతీ సాధించుకోలేక పోతున్నారనే వాదన ఉంది. ఇక, యువతకు ప్రాధాన్యం ఇస్తే.. తప్ప పార్టీ బలోపేతం కాదని.. అధిష్టానం నుంచి అనేక మార్లు సందేశాలు వచ్చినా.. సోము తనకు తానే యువతగా భావించుకున్నారని.. ఎవరినీ ఎదగనివ్వలేదని.. సీనియర్లు అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. పైగా.. తాను ఒకదారి.. పార్టీ నేతలది మరోదారి అన్నట్టుగా ముందుకు నడిచారు.
కీలకమైన అమరావతి రాజధాని విషయం కానీ, పోలవరం ప్రాజెక్టు అంశంగానీ, జగన్ సర్కారు అవినీతి, ఆర్ధిక దుబారాపై కానీ.. గతంలో కన్నా లక్ష్మీనారాయణ చూపిన పాటి దూకుడుకూడా సోము చూపించలేక పోయారు. ఫలితంగా ఏడాదికిపైగా బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఉండి.. సోము సాధించింది ఏమీలేదనే భావన, వాదన రెండూ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మిత్రపక్షం జనసేనతోనూ.. కలివిడి లేక పోవడం.. బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సోము ను పక్కన పెట్టక తప్పడం లేదనే వాదన తెరమీదికి వచ్చింది. త్వరలోనే సోమును మారుస్తారని ఢిల్లీ నుంచే సంకేతాలు రావడంతో ఇప్పుడు సోము వర్గం డోలాయమానంలో పడగా.. బీజేపీలోనే ఆయన వ్యతిరేక వర్గం ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది.
This post was last modified on August 7, 2021 7:58 pm
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…