రాజకీయాల్లో చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిణామమే వైసీపీలోనూ చోటు చేసుకుంది. రాజకీయంగా ఉప్పు నిప్పుగా ఉండే.. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్‌తో వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
నిజానికి జేసీ కుటుంబాన్ని గత 2019 ఎన్నికలకుముందు.. పార్టీలో చేరాలని జగన్ ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో దివాకర్‌రెడ్డి ప్రస్తావించారు. తనను జగన్ పార్టీలోకి చేరమంటున్నాడని.. అయితే.. కప్పం కట్టాలంటూ.. కిందిస్థాయి నాయకులు సమాచారం ఇస్తున్నారని.. నేనెందుకు వెళ్లాలి? నేనెందుకు కప్పం కట్టాలి? అని ఆయన అప్పట్లో ప్రశ్నించారు. ఆ తర్వాత.. దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి కూడా వైసీపీవైపు మొగ్గు చూపారు.
అనంతపురం ఎంపీ టికెట్ కోసం.. వైసీపీని సంప్రదించారని.. దీనికి కుటుంబం మొత్తం పార్టీలోకి వస్తే..ఏం కోరినా ఇచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని. జగన్ సంకేతాలు పంపారు. కానీ, ఆ ఎన్నికల సమయంలో మళ్లీ టీడీపీ విజయం దక్కించుకుంటుందనే ఉద్దేశంతో జేసీ ఫ్యామిలీ టీడీపీ తరఫునే బరిలో నిలిచింది.
అయితే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న తాడిపత్రి తో పాటు.. అనంతపురం పార్లమెంటు స్థానంలోనూ జేసీ తనయులు ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత .. వైసీపీ అధికారంలోకి రావడంతో మరోసారి పార్టీలో చేరాలంటూ.. వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ.. వీరు పార్టీ మారలేదు. దీంతో కేసులు.. జైళ్లు తదితరాలు తెర మీదికి వచ్చాయి.
అయితే.. స్థానిక ఎన్నికల నుంచి కూడా జగన్ మళ్లీ జేసీ వర్గానికి చేరువ అవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో.. జేసీ వర్గానికి మద్దతుగా వ్యవహరించారు. ఎందుకంటే.. తాడిపత్రి మునిసిపాలిటీలో జేసీ వర్గం బొటాబొటి స్థానాలు గెలుచుకుంది. దీంతో ఇక్కడ ఓ నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులను టీడీపీ నుంచి లాగేస్తే..వైసీపీనే మునిసిపాలిటీని దక్కించుకుని ఉండేది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యూహం కూడా ఇదే.
కానీ.. జగన్ దీనికి అడ్డుపడి.. జేసీ ప్రభాకర్ రెడ్డి.. చైర్మన్ అయ్యేలా తెరచాటున అందరినీ మౌనంగా ఉండేలా చేశారని.. అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రభాకర్ రెడ్డి కూడా ఒప్పుకొన్నారు. జగన్ సహకరించకపోతే..తాను చైర్మన్ అయ్యేవాడిని కాదని ఆయన బహిరంగ వ్యాఖ్యలే చేశారు.
ఇక, వైఎస్ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ.. వైసీపీ కొంత మేరకు దూకుడు ప్రదర్శించినా.. ఈ పదవిని దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ.. ఈ విషయంలోనూ.. జగన్ అందరినీ సైలెంట్ చేశారు. దీంతో జేసీ వర్గానికే చెందిన మైనార్టీ అభ్యర్థి అబ్దుల్.. వైస్ చైర్మన్ అయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తే.. జేసీ వర్గాన్ని.. జగన్ మచ్చిక చేసుకుంటున్నారా? తాడిపత్రి, అనంతపురం పార్లమెంటులో బలమైన ఓటు బ్యాంకు ఉన్న జేసీలను తన వైపు తిప్పుకొనే వ్యూహం వేస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. పైగా.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూకుడుకు.. జగన్ పరోక్షంగా కళ్లెం వేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే.. జగన్ వ్యూహాన్ని మౌనంగా గమనిస్తున్న జేసీ వర్గం.. ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చని.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 4, 2021 5:30 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…