దిశ ఎన్ కౌంటర్.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరూ మర్చిపోయి ఉండరు. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా బతికుండగానే తగలపెట్టారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ కూడా చేశారు. కాగా.. తాజాగా ఎన్‌కౌంటర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు లో తాజాగా తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తింది. సుప్రీం కోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా.. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు మరో ఆరు నెలలు సమయం కావాలని సుప్రీం ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పదే పదే సమయం ఎందుకు కోరుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారు.. ఇంకా ఎందరిని ప్రశ్నించాలి? అని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. ఈ కేసును అతి త్వరలో తేల్చాలని జేఐ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. కాగా దిశ రేప్ కేసులో.. నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రేప్ చేసిన స్థలంలోనే నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
This post was last modified on August 3, 2021 5:58 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…