ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారనున్నారా? త్వరలోనే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టనున్నారా? ఈ క్రమం లో మార్పులు, చేర్పుల దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దృష్టి పెట్టిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రెండు రోజుల కిందట కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ రాజకీయాలపై ఆరాతీసింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేసింది. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని తేల్చింది. ఈ క్రమంలోనే మార్పు దిశగా అడుగులు తప్పవని.. రాష్ట్ర నేతలకు సూచించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్.. ఊమెన్ చాందీ అత్యంత రహస్యంగా నాయకులతో భేటీ అయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న చీఫ్ శైలజానాథ్ సహా.. పలువురు నేతలతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చాందీ.. పార్టీ అధిష్టానం మనసులో మాటను కుండబద్దలు కొట్టారు. పార్టీ చీఫ్‌ను మార్చాల ని.. అధిష్టానం నిర్ణయించిందన్న చాందీ.. పదవులను త్యాగం చేసేందుకు ఎప్పుడైనా రెడీగా ఉండాలని మానసికంగా.. వారిని సిద్ధం చేశారు. దీంతో ఇక, పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంచుకునేందుకు రెడీ అయిన విషయం.. కాంగ్రెస్ నేతల మధ్య రహస్య మంతనాల్లో చర్చకు వస్తోంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా.. ఇక్కడ ఆ పదవి కోసం.. కొట్టుకునేవారు.. కుమ్ముకునేవారు ఎవరూ లేకపోవడం అధిష్టానానికి ఒకింత తలనొప్పి తగ్గించిందనే చెప్పాలి.
అయితే.. ఎవరిని ఎన్నుకుంటే.. పార్టీని లోపేతం చేస్తారనే వ్యాఖ్యలు, విశ్లేషణలు కాంగ్రెస్ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే.. బెటర్ అనే మాట వినిపిస్తోంది. ఇక, పార్టీకి దూరంగా ఉన్న రఘువీరారెడ్డిని తిరిగి చేర్చుకుని.. ఆయనకే మరోసారి పగ్గాలు ఇచ్చేందుకు కూడా అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందని కొందరు చెబుతు న్నారు. ఇదిలావుంటే.. కేంద్ర మాజీ మంత్రి.. పళ్లంరాజు.. ఎప్పటి నుంచో పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారని.. ఇప్పుడు న్న పరిస్థితిలో జగన్ ను బలంగా ఎదుర్కొని.. పార్టీని నడిపించాలంటే.. ఇలాంటి అవసరమని.. ఇంకొందరు అంటున్నారు.
అయితే.. ఎక్కువ మంది మాత్రం మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికే ఈ సారి పగ్గాలు దక్కుతాయని.. చెబుతున్నారు. ఇదే విషయం చాందీ భేటీలోనూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర విభజనకు ముందు.. యాక్టివ్‌గా ఉన్న కిరణ్.. కుమార్ ఇప్పుడు కనుక పదవి ఇస్తే.. ఏవిధంగా పార్టీని లైన్‌లో పెడతారో చూడాలి.
This post was last modified on July 31, 2021 2:04 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…