Political News

విశాఖ ఉక్కు.. ఎలా క‌వ‌ర్ చేద్దాం.. వైసీపీలో హీటెక్కిన చ‌ర్చ‌

వైసీపీలో నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు వేడెక్కాయి. ఇప్పుడు ఎలా ముందుకు సాగుదాం.. ప్ర‌జ‌ల‌ను ఎలా న‌మ్మిద్దాం! అంటూ.. నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇంత‌కీ ఏవిష‌యం అంటే.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌రణ అంశ‌మే! ఈ విష‌యంలో “మేం ఆపుతున్నాం.. కేంద్రాన్ని వేలు పెట్ట‌నివ్వం. మా ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే లేఖ‌లు సంధించారు. ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌రంగా రాజ‌కీయం.. రాద్ధాంతం చేస్తున్నాయి. మాకు మాత్రం విశాఖ ఉక్కుపై ప్రేమ లేదా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్య‌త ప్ర‌జ‌లు మాకు క‌దా ఇచ్చారు!” అంటూ.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌బుర్లు చెప్పిన వైసీపీనాయ‌కుల‌కు కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు షాకిస్తోంది.

ఇప్ప‌టికే తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో కూడా.. విశాఖ ఉక్కును నూటికి నూరు శాతం అమ్మేసే తీరుతామ‌ని.. కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విష‌యాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టి చెప్పింది. అంటే.. సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు రాసిన లేఖ‌లు.. వైసీపీ ఎంపీ.. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌.. సాయిరెడ్డి చేసిన పాద‌యాత్ర‌లు.. పార్ల‌మెంటులో చేసిన ప్ర‌సంగాలు అన్నీ.. కొట్టుకుపోయాయి. కేంద్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెప్పేసింది. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. వైసీపీని కుదిపేస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎంపీలు.. రాజీనామా చేసి.. కేంద్రానికి బుద్ధి చెప్ప‌యినా.. విశాఖ ఉక్కును నిలుపుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. “మేం రాజీనామాలు చేస్తాం.. మీరు కూడా చేయండి.. మీ నాయ‌క‌త్వంలోనే మా ఎంపీలు కూడా ప‌నిచేస్తారు. విశాఖ ఉక్కును కాపాడుకుందాం. రండి!” అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. అయితే.. వైసీపీ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. పైగా.. గ‌తంలో ప్ర‌త్యేక హోదా కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. రాజీనామాల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన‌.. జ‌గ‌న్‌.. ఇప్పుడు అదే అస్త్రం టీడీపీనుంచి వినిపించే స‌రికి.. తేలుకుట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.

కానీ, విశాఖ‌లో ప‌రిస్థితి చూస్తే..నానాటికీ తీవ్ర‌మ‌వుతోంది. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు ఉద్య‌మ బాట పట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా ఉద్యోగుల సెంటిమెంటుకు నేత‌లు ఫిదా అవుతున్నారు. ఈ స‌మ‌యంలో వైసీపీ కూడా గొంతు క‌ల‌ప‌క‌పోతే.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యంపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం.. ఇక్క‌డి ఎమ్మెల్యేలు.. ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారు? త‌మ త‌ప్పులేద‌ని.. త‌ప్పించుకుంటారా? లేక అసెంబ్లీలోనూ చేసిన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ వ్య‌తిరేక‌త తీర్మానానికి క‌ట్టుబ‌డి కేంద్రాన్ని నిల‌దీస్తారా? చూడాలి.

This post was last modified on July 30, 2021 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

1 minute ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

46 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

50 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

57 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

2 hours ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

2 hours ago