స్పీకర్ అంటే బాగా మాట్లాడేవారు అని తెలుగులో అనువదించుకోవాలి. కానీ నిజానికి స్పీకర్ అన్న వారు ఎవరూ బయట పెద్దగా మాట్లాడరు. అది రాజ్యాంగ బధ్ధ పదవి. రాజకీయ నాయకుల మాదిరిగా వారు దూకుడుగా అసలు మాట్లాడరు, హుందాతనంతోనే ఉంటారు. కొందరు మాత్రం పూర్వపు రాజకీయ వాసనలను వదలలేక మాట్లాడుతూ ఉంటారు. అలా కనుక చూసుకుంటే ప్రస్తుత సభాపతి తమ్మినేని సీతారాం గట్టిగానే మాట్లాడుతారు. ఆయన దాదాపుగా ప్రతీ విషయం మీద కూడా రియాక్ట్ అవుతారు. తనదైన అభిప్రాయాలని కూడా చెబుతారు. కొన్నిసార్లు ఆయన వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేస్తూంటారు. రాజకీయ నాయకుల మాదిరిగా విపక్షాల మీద కూడా ఆయన చాలా గట్టిగానే నోరు చేసుకుంటారు.
అది తమ్మినేని సీతారాం స్టైల్ అనుకోవాలేమో. ఇదిలా ఉంటే ఆయన దిశ చట్టం ద్వారా కూడా మహిళల మీద మానవ మృగాలలో ధోరణిలో మార్పు లేకపోతే వారిని అవుట్ ఆఫ్ లా ద్వారానైనా వారిని కఠినంగా శిక్షించాలంటూ పవర్ ఫుల్ గానే మాట్లాడారు. అంతెందుకు చంద్రబాబు, టీడీపీ నేతలపై సైతం ఆయన ఓ రాజకీయ పార్టీలో ఉన్న నేతలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.
నిజానికి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారు ఇలా అవుట్ ఆఫ్ లా అని మాట్లాడరు. చట్టాలను, రాజ్యాంగాన్ని పరిరక్షించే వారు ఇలా మాట్లాడితే దాని ఫలితాలు పర్యవశానాలు ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలిసిందే. కానీ స్పీకర్ తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండాలనుకోవడంలేదు అంటున్నారు. అందుకే ఆయన సందర్భం వచ్చిన ప్రతీసారీ రాజకీయ వ్యాఖ్యానాలే చేస్తున్నారు అంటున్నారు.
ఆయన వీలు దొరికినపుడల్లా జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు. యువ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఏపీ అన్ని రకాలుగా అభివృద్ధి సాధిస్తుంది అని కూడా చెబుతున్నారు. న్యాయ సమీక్షలో ఉన్న మూడు రాజధానుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఆయన ఈసారి ఎలాగైనా మంత్రి కావాలని అనుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు. అందుకోసమే జగన్ దృష్టిలో పడడానికే ఆయన ఇలా చేస్తున్నారు అంటున్నారు. మరి జగన్ కనుక విస్తరణలో అవకాశం కల్పిస్తే హ్యాపీగా మరో రెండున్నరేళ్ల పాటు పనిచేసి రిటైర్ కావాలనేది తమ్మినేని వారి ఆలోచనట. అందుకే ఆయన ఈ మధ్యనే మళ్లీ సౌండ్ పెంచేశారు అంటున్నారు.
This post was last modified on July 29, 2021 6:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…