విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మరీ తెగించేసినట్లు అర్ధమైపోతోంది. సుప్రింకోర్టులో దాఖలు చేసిన తన అఫిడవిట్లో ప్రైవేటీకరణ ఆపేదిలేదని చెప్పేసింది. ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే బిడ్డింగులను ఆహ్వానించినట్లు కేంద్ర తేల్చిచెప్పింది. ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు లేదని ఉద్యోగులు అడ్డుపడటంలో అర్ధంలేదన్నది. పనిలో పనిగా ప్రైవేటీకరణపై సుప్రింకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన లక్ష్మీనారాయణకు అసలు అర్హతే లేదని అభ్యంతరం వ్యక్తంచేసింది.
మొన్నటి ఎన్నికల్లో లక్ష్మీనారాయణ వైజాగ్ పార్లమెంటు సీటులో పోటీచేసిన కారణంగా ఆయన పిటీషన్ వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పింది. ఉద్యోగుల అభ్యంతరాల విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. అదేమిటంటే ప్రైవేటీకరణకు అడ్డుపడుతున్న ఉద్యోగులను అవసమైతే ఉద్యోగాల్లో నుండి తొలగించి మరీ ప్రైవేటీకరణప్రక్రియ పూర్తి చేస్తామని అఫిడవిట్లో చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
ఒక ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని అనుకున్న తర్వాత అవసరమైతే ఉద్యోగులను తొలగిస్తానని కేంద్రం గతంలో చెప్పిన దాఖలాలు లేవు. తాజా అఫిడవిట్లో అలా చెప్పిన విధానం చూస్తుంటే కేంద్రం పూర్తిగా తెగించేసిందనే అర్ధమైపోయింది. ఉక్కు ఫ్యాక్టరీపై వేలాదిమంది ఉద్యోగులు ఆధారపడ్డారు. ఒకసారి ప్రైవేటుపరం అయ్యిందంటే కొనుక్కున్న సంస్ధ ఎప్పుడోప్పుడు స్ధలాన్ని రియలఎస్టేట్ కు వాడుకుని ఫ్యాక్టరీని మూసేస్తుందని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన పడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని అమ్మేస్తోందంటే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ లాభాల్లో ఉండి రికార్డు స్ధాయిలో ఉక్కును ఉత్పత్తి చేస్తున్న సంస్ధను కూడా కేంద్రం అమ్మేస్తుండటమే విచిత్రంగా ఉంది. జరుగతున్నది చూస్తుంటే వైజాగ్ పై నరేంద్రమోడి సర్కార్ పగబట్టిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉద్యోగ, ఉపాధిని కల్పిస్తున్న ఫ్యాక్టరీని నిష్కారణంగా అమ్మేయటం దారణమే.
దక్షిణభారత దేశంలో వైజాగ్ కు ఇంత ఇంపార్టెన్స్ రావటానికి కారణాల్లో స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఒకటి. స్టీల్ ఫ్యాక్టరీ, నావల్ బేస్, పోర్టు తదితర సంస్ధల వల్ల వైజాగ్ చాలా వేగంగా, సహజసిద్దంగా కాస్మొపాలిటన్ నగరంగా పెరిగిపోయింది. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే ఈ నగరాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. ఇలాంటి సమయంలో అనవసరంగా వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించటం ఎవరికీ నచ్చటంలేదు.
This post was last modified on July 29, 2021 6:27 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…