ఐపీఎస్ మాజీ అధికారి, స్వేరో చీఫఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన బీఎస్పీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు.. జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.
ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఆ సయమంలోనే ప్రవీణ్ తో పాటు దాదాపు 5లక్షల మంది బీఎస్పీ తీర్థం పుచ్చుకునేలా ప్లాన్ చేశారట.
నిజానికి కాన్షీరాం అడుగుజాడల్లో నడుస్తానని ప్రవీణ్ కుమార్ ప్రకటించినప్పుడే.. బీఎస్పీ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదించారని వార్తలొచ్చాయి. అంతేకాదు సొంతంగా పార్టీ పెడతారని కూడా అనుకున్నారు. కానీ.. చివరకు బీఎస్పీలో చేరుతున్నట్లు కన్ఫామ్ చేశారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆధిపత్య కులాల నాయకులను గారు అని గౌరవించి.. పీడిత వర్గాలకు చెందినవారిని ఏక వచనంతో పిలిచారని మండిపడ్డారు. ఈ దురహంకార భావజాలం వల్లే ప్రజలు బహుజన రాజ్యం రావాలని అంటున్నారని చెప్పారు.
This post was last modified on July 27, 2021 6:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…