ఈయన ఒకపుడు ఫైర్ బ్రాండ్ నేతగా పాపులరయ్యారు. అయితే కాలక్రమంలో పరిస్ధితుల ప్రభావం కారణంగా ఎవరికీ కాకుండా పోయారు. అందుకనే సంవత్సరాలుగా అనామకంగా ఉండిపోయారు. అయితే ఇపుడు అధికార టీఆర్ఎస్ లో చేరటం ద్వారా పూర్వవైభవాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈయనే సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. తన వ్యూహాన్ని అమలు చేయటంలో భాగంగానే బీజేపీకి మూడు రోజుల క్రితమే రాజీనామా కూడా ఇచ్చేశారు.
మోత్కుపల్లిది మొదటి నుండి విచిత్రమైన వ్యవహార శైలి. ఏ పార్టీలో ఉన్నా, విషయం ఏదైనా తన మాటే చెల్లుబాటు కావాలనే పంతం ఎక్కువ. ఎన్టీయార్ పిలుపుతో నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లోకి దూకారు. చిన్న వయస్సులోనే ఎంఎల్ఏగా గెలవటమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. అయితే ఎన్టీయార్ తో పడని కారణంగా పార్టీకి దూరమయ్యారు.
మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 1999లో కాంగ్రెస్ తరపున గెలిచినా చంద్రబాబునాయుడు పిలుపుతో టీడీపీలోకి దూకేశారు. అప్పటి నుండి 2017 వరకు టీడీపీలో తన హవా బాగానే నడిచింది. చాలా మంది నేతలకు లాగే రాష్ట్ర విభజన ప్రభావం ఈయన పైన కూడా పడింది. ఎప్పుడైతే తెలంగాణా టీడీపీకి క్షీణ దశ మొదలైందో మోత్కుపల్లికి కూడా డౌన్ ఫాల్ స్టార్టయ్యింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోత్కుపల్లికి చాలా మంది నేతలతో పడదు. ఎందుకంటే తనమాటే చెల్లుబాటవ్వాలనే మనస్తత్వం వల్లే తరచు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుండి టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటు నానా రచ్చ చేశారు. ఈయన గోలను భరించలేక చివరకు చంద్రబాబు పార్టీ నుండే బహిష్కరించారు. టీడీపీలో ఉండి టీఆర్ఎస్ కు వత్తాసుగా మాట్లాడిన కారణంగా తనను కేసీయార్ అక్కున చేర్చుకుంటారని ఆశించిన మోత్కుపల్లికి నిరాసే ఎదురైంది.
తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ నేత బీజేపీలో చేరారు. అయితే కమలంపార్టీలో కూడా ఈయనను ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో తోచక చివరకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఈయనే ప్రకటించారు. తన రాజీనామాకు కారణాన్ని ఈటలను చేర్చుకోవటంగా మోత్కుపల్లి చూపటమే విచిత్రం. ఎందుకంటే మోత్కుపల్లి, ఈటల జిల్లాలు వేరు, నియోజకవర్గాలు వేరు. అయినా ఈటలను అవినీతి పరుడిగా చిత్రీకరించటం, ఈటలను పార్టీలో చేర్చుకోవటం తనకిష్టం లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
రాజకీయంగా మోత్కుపల్లి జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు చేరుకునేశారు. చివర దశలో టీఆర్ఎస్ లో కూడా సర్దుకోలేకపోతే ఇక మారటానికి పార్టీ కూడా లేదు. టీడీపీ నుండి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన నేతల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి కొత్తగా చేరబోతున్న మోత్కుపల్లి రాజకీయం ఎలాగుంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే.
This post was last modified on July 26, 2021 3:52 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…