మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుపెన్నడూ లేని రీతిలో గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పలు సంచలన ప్రకటనలు చేస్తున్నారు.
అయితే, ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే తెలగాణలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ కుమార్‌కు వల వేస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఓపెన్ హార్ట్‌తో స్వాగతిస్తామని కాంగ్రెస్ బహిరంగ ప్రకటన చేసింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్, మహేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉపఎన్నిక, ఉద్యోగాల భర్తీ కోసం 48 గంటల దీక్ష తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. దళిత సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించిందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే గురుకులాలకు కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన పార్టీలోకి వస్తానంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
దళిత సీఎం, మూడెకరాల భూమి విషయంలో కేసీఆర్ మోసంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ నిలదీయాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేసే నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, హెచ్‌ఆర్సీ, హైకోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు.
పేదలకిచ్చిన అసైన్డ్ భూమిపై కుటుంబాలు తరతరాలు ఆధారపడి జీవిస్తాయని, కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూముల విలువ పెరిగిందన్నారు. ఆ భూములను కేసీఆర్ పేదల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, తమ గోడును చెప్పుకోవడానికి వెళితే కలెక్టర్లను కలువడం లేదని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ ప్రతిపాదనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో మరి!
This post was last modified on July 26, 2021 11:54 am
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…