Political News

రేవంత్ కుర్రోడేనా..!

రేవంత్ ని పీసీసీ చీఫ్ పదవిని కలిపి చూడలేకపోతున్నారుట. రేవంత్ పక్కా జూనియర్ అని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూచిక పుల్లను తీసేసినట్లుగా పక్కన పెట్టేశారు. ఇక రేవంత్ రెడ్డికి అనేక మైనసులు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు అనుంగు శిష్యుడు అని పెద్ద ట్యాగే ఉంది. చంద్రబాబు మాట మీద ఓటుకు నోటుకు కేసులో దూరి అడ్డంగా ఇరుక్కున్న చరిత్ర ఉంది. మరో వైపు తనలో టీడీపీ వాసనలు ఏ మాత్రం పోలేదు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి అసలు వెనకాడడంలేదు. ఆయన తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కిన వెంటనే టీడీపీ అనుకూల మీడియా పెద్దలను కలసి వచ్చారు. ఇవి చాలు కదా ఆయన అసలైన కాంగ్రెస్ వారికి మంట పుట్టించడానికి..!

ఇక రేవంత్ ప‌గ్గాలు కూడా చేప‌ట్టేశారు. ఇప్ప‌ట‌కీ రేవంత్ రెడ్డిని ఏమీ తెలియని కుర్ర నాయకుడిగానే కాంగ్రెస్ లో చూస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ లో వర్గ పోరు ఎక్కువ. వైఎస్సార్ లాంటి బిగ్ ఫిగర్ పీసీసీ చీఫ్ గా ఉంటేనే పార్టీలో గొడవలు జరుగుతూ వచ్చాయి. వైఎస్సార్ ఏమీ బయటవారు కారు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన పెద్ద మనిషి. అలాంటి ఆయన్నే ఖాతరు చేయని వర్గం నాడు కాలు దువ్వింది. అలా పోల్చుకుంటే రేవంత్ రెడ్డిని వారు ఎందుకు లెక్క చేస్తార‌ని చెప్పాలి. పైగా ఆయన మూడేళ్ళకు ముందు మాత్రమే కాంగ్రెస్‌లో వచ్చి చేరారు. ఇక ఆయన వర్గం అంటున్న వారు అంతా కూడా టీడీపీ వారే పక్కన ఉంటున్నారు.

దాంతో ఈ పరిణామాలు కాంగ్రెస్ లో కొత్త వివాదాలు, గ్రూపు తగాదాలు సృష్టిస్తున్నాయి. మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో సీనియర్లు అంతా కూడా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడాన్ని అవమానంగా భావిస్తున్నారుట. అధికారం మాట పక్కన పెట్టి రేవంత్ వెంట నడవడం ఏంటి అన్న బాధ కూడా వారిలో కలుగుతోందిట. ఇంత బతుకూ బతికి అన్నట్లుగా కాంగ్రెస్ బడా నాయకులు పడుతున్న మనో వేదన చూస్తూంటే కాంగ్రెస్ ని ఎవరూ ఓడించనక్కరలేదు వారే ఓడించుకుంటారు అన్న మాట అయితే వినిపిస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డిని తెచ్చి కాంగ్రెస్ చేసిన ప్రయోగం వికటించే ప్రమాదమే ఉందని వర్గ పోరు చూస్తూంటే అర్ధమవుతోంది.

అంతెందుకు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా నిన్న‌టి వ‌ర‌కు ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడు చేయ‌డంతోనే పార్టీని వీడి కారుక్కేశారు. ఇది ఒక్క కౌశిక్‌రెడ్డికి మాత్ర‌మే కాదు… ఎంతో మంది కాంగ్రెస్ నేత‌లు కూడా రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ఈ అసంతృప్త రాగాల వెన‌క పార్టీలోనే కొంద‌రు సీనియ‌ర్లు ఉండి ఎగ‌దోస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి రేవంత్ ఈ కుట్ర‌ల‌ను ఎలా ? చేధిస్తారో ? చూడాలి.

This post was last modified on July 26, 2021 8:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…

18 minutes ago

వాస్త‌వానికి.. మంగ‌ళ‌గిరిలో పోటీ చేయాల‌ని లేదు: నారా లోకేష్‌

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా…

27 minutes ago

భారతీయులకు ఇలా జరగాల్సిందే… రాణా కామెంట్స్ వైరల్

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై…

27 minutes ago

ఒంటిమిట్ట రాములోరికి 7 కిలోల బంగారు కిరీటాలు

ఏపీలోని అన్నమయ్య జిల్లా వెలసిన ఒంటమిట్ల రాములోరికి శుక్రవారం భారీ బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. రాములోరితో పాటుగా సీతమ్మ…

35 minutes ago

మాది బీసీల పార్టీ: చంద్ర‌బాబు

"మాది బీసీ ప‌క్ష‌పాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ" అని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు వ్యా ఖ్యానించారు.…

1 hour ago

మాధవ్ ఎక్కడ?.. వైసీపీ నేతపై కేసుల పరంపర

ఖాకీ చొక్కను వదిలి ఖద్దరు చొక్కా వేసుకున్న వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సాయంత్రం…

2 hours ago