రాజకీయాల్లో పుంజుకోవాలంటే.. వ్యూహాలు మార్చుకోవాల్సిందే. పిడివాదాలకు పోతే.. పరిస్థితులు తల్లకిందులైన పరిస్థితి గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలూ చవిచూశాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నో ఆశలతో.. అధికారం అందేసుకోవడం.. ఖాయమనే అంచనాలతో ఎన్నికల రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఘోరంగా ఓడిపోయారు. 175 నియోజక వర్గాలో బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని.. స్వయంగా 148 స్థానాలకు పోటీ చేసినా.. కేవలం ఒక్కచోట(రాజోలు) మాత్రమే విజయం దక్కించుకున్నారు.
అయితే.. పవన్ విషయంలో.. ఎవరు ఓడిపోయారు.. ఎవరు గెలిచారు.. అనే విషయాల కన్నా కూడా.. స్వయంగా ఆయనే ఓడి పోవడం.. మరింత పెయిన్‌గా మారింది. మొత్తం అందరూ ఓడిపోయినా.. తానొక్కడు గెలిచి ఉంటే.. పార్టీకి ఇబ్బందులు ఉండేవి కావనే విశ్లేషణలు వచ్చాయి.
గత ఎన్నికల్లో పవన్ రెండు నియోజకవర్గాల నుంచి(గతంలో చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేసి ఒకచోట గెలిచారు) పోటీ చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేశారు. గాజు వాక పోయినా.. తనకు కుటుంబం పరంగా, సామాజికవర్గం పరంగా ఎంతో బలం ఉందనుకున్న భీమవరంలో కూడా పవన్ బోణీ కొట్టలేక పోయారు.
రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన రెండోస్థానంలో ఉన్నారు. అయితే.. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమని పవన్ భావిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో.. పవన్ పోటీ చేసే నియోజకవర్గం విషయంపై ఆసక్తికర చర్చ సాగినట్టు తెలుస్తోంది. పవన్ వంటి బలమైన గళం వినిపించే నాయకుడు.. అసెంబ్లీలో ఉండాలనేది వైసీపీయేతర పార్టీలకు కూడా సానుకూల అంశమే. గత ఎన్నికల్లో ఇదే భావించాయి. అయితే.. రెండు చోట్ల పోటీ చేసినా.. ఆయన ఓడిపోయారు. కానీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం పవన్‌కు సహకరించే వ్యూహంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా.. ఇతర పార్టీలు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
పవన్… రాజకీయాలు గమనించిన ఇతర పార్టీలు.. అందరి సమస్యలను విని.. పరిష్కారం కోసం ప్రయత్నించే నేతగా ఆయనను పేర్కొంటున్న విషయం తెలిసిందే. అందుకే రాజకీయంగా ఆయనపై విమర్శలు చాలా తక్కువ. ఆయన సినిమాల్లోకి వెళ్లినా.. పార్టీ పై ఎవరూ పెద్దగా విమర్శలు చేయలేదు. అంటే.. పవన్ వంటి నాయకుడిని రాజకీయాలకు దూరం చేసుకోకూడదనే వ్యూహం పార్టీలకు ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పవన్‌కు సహకరించే అవకాశం కనిపిస్తోంది. అంటే.. పవన్ పోటీ చేసే నియోజకవర్గం(అది ఎక్కడైనా ఏ జిల్లా అయినా సరే)లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా.. పవన్ విజయానికి సహకరించే అవకాశం కనిపిస్తోంది.
గతంలో 2009 ఎన్నికల్లోనూ ఉమ్మడి రాష్ట్రంలో లోక్‌సత్తా నేత, మాజీ ఐఏఎస్ అధికారి.. జయ ప్రకాశ్ నారాయణ(జేపీ) విషయంలో ఇదే తరహా ఫార్ములాను అవలంభించారు. మేధావిగా గుర్తింపు పొందిన జేపీని సభకు పంపించడం ద్వారా.. తమకు ప్రయో జనం ఉంటుందని భావించిన టీడీపీ సహా.. పలు పార్టీలు(కాంగ్రెస్ కాదు) ఆయన పోటీచేసిన కీలక నియోజకవర్గం కూకట్‌పల్లిలో డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపి.. ఆయన విజయానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు పవన్ విషయంలోనూ ఇదే ఫార్ములాను అవలంభించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి.. ఈ ఫార్ములాతో అయినా..పవన్ సభలోకి అడుగు పెడతారో లేదో చూడాలి.
This post was last modified on July 25, 2021 8:53 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…