రాయలసీమ ప్రాజెక్టులపై సీనియర్ నేత మైసూరారెడ్డిని వైసీపీ ఎంఎల్ఏ, కొడుకు వరసయ్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఇపుడు రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న మైసూరా 2014-19 మధ్యలో ఎందుకు నోరిప్పలేదని తగులుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం ఉన్నపుడే తెలంగాణా ప్రభుత్వం జలదోపిడి చేసిన విషయం మైసూరాకు తెలీదా అంటు ప్రశ్నించారు.
కేసీయార్ దోపిడీని చంద్రబాబునాయుడు ఆపడంలో ఫెయిల్ అయినపుడు మైసూరా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పట్లో తెలంగాణా జలదోపిడిని అడ్డుకోలేకపోయారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని జగన్ ప్రయత్నిస్తున్న విషయం తెలియదా అంటు మైసూరాను డాక్టర్ సూటిగా ప్రశ్నించారు.
ఏపికి అన్యాయం చేస్తున్నది కేసీయార్ అయితే మైసూరా జగన్ను ప్రశ్నించటంలో అర్ధమేలేదన్నారు. ఏపికి తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా అంగీకరించిన విషయం మైసూరాకు తెలీదా అని డాక్టర్ మండిపడ్డారు. కేటాయించిన నీటికన్నా తెలంగాణా ప్రభుత్వం ఎక్కువ వాడేసుకుంటోందని, అక్రమంగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి పార్లమెంటులోనే అంగీకరించిన విషయాన్ని మైసూరా గమనించాలన్నారు.
ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలన్న విషయం సీఎంలిద్దరికీ తెలీదా అంటూ డాక్టర్ మైసూరాను ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్రభుత్వం చర్చలకు కలసి రానికారణంగానే జగన్ కేంద్ర సంస్ధలకు, కేంద్రానికి లేఖలు రాయాల్సొచ్చిందని మైసూరాకు తెలీదా అని ప్రశ్నించారు. ఇంతకీ డాక్టర్ సుదీర్ రెడ్డి మాజీమంత్రి మైసూరాకు కొడుకు వరసవుతారు. మైసూరా తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొడుకే జమ్మలమడుగు ఎంఎల్ఏ డాక్టర్ సుధీర్ రెడ్డి. మొత్తానికి మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్ పడింది.
This post was last modified on July 23, 2021 12:22 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…