తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఎన్నికలను ఉద్దేశించి..బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు.
తమ డిమాండ్స్ పూర్తి చేయకుంటే.. హుజురాబాద్ లో వెయ్యి మంది అభ్యర్థులను పోటీకి దింపుతానని హెచ్చరించారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్ల కోసం కృష్ణయ్య దీక్ష చేపట్టారు. తొలగించిన 7వేల 600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటేనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో వెయ్యి మందితో పోటీ చేస్తామన్నారు. పది వేల మందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా ఉండేవారు. అయితే గతేడాది ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్నామని.. తమను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని అప్పట్లో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేపట్టారు. ఈ కారణంగా ప్రభుత్వం వారిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.
This post was last modified on July 21, 2021 9:47 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…