ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏం చేస్తోంది? ఎలా ముందుకు సాగుతోంది ? అంటే.. అసలు వదిలేసింది గురూ! అనేకామెంట్ వినిపిస్తోంది. నిజానికి ప్రతిపక్షం అంటే.. ప్రజల మధ్య ఉండాలి. పోనీ.. కరోనా వచ్చిందని తప్పించుకున్నా..ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరువ అవ్వాలి. కమ్యూనిస్టులు, బీజేపీ నేతలు.. ఈ క్రమంలో ప్రజల్లోనే ఉన్నారు.కానీ, టీడీపీ మాత్రం తమ అవసరం వస్తే.. ఒక విధంగా.. ప్రజల విషయానికి వస్తే.. మరో విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలను పూర్తిగా పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షంగా ఉండాలనే విషయం టీడీపీ మరిచిపోయిందని అంటున్నారు.
డిజిటల్ మీడియాను నమ్ముకున్న టీడీపీ.. మున్ముందు .. దీనిని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నే అన్ని జిల్లాల్లోనూ డిజిటల్ టీడీపీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవానికి డిజిటల్ మాధ్యమం అనేది ఎంతమందికి చేరువ అవుతుంది ? ఎంతమంది డిజిటల్‌తో అనుసంధానమై ఉన్నారు? అనే విషయాలను ఎవరూ పట్టించు కోకపోవడం గమనార్హం. ఇప్పుడున్న ఏపీ జనాభాలో కేవలం 35 శాతం మంది మాత్రమే డిజిటల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. 20 శాతం మంది మాత్రమే డెస్క్‌టాప్‌లను వినియోగిస్తున్నారు. ఇక, వీరిలోనూ వారి విధుల కోసం వినియోగిస్తున్నవారే ఎక్కువ.
ఇక, యూత్‌లో డిజిటల్ మాధ్యమాలపై ఫోకస్ ఉన్నప్పటికీ.. వారు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజకీయ విశ్లేషకులు విమర్శకులు మాత్రమే ఈ డిజిటల్ మీడియా రాజకీయాల విషయంలో ఎడిక్ట్ అయ్యారని.. తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ టీడీపీ చేసే పని ఏంటో.. పార్టీ అధినేతకే తెలియాలని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా ఉంటే ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా.. లేదా.. ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ఆదిశగా అడుగులు వేయడం ద్వారా టీడీపీ పుంజుకుంటుంది తప్ప.. డిజిటల్ టీడీపీ వల్ల.. కనీసం పది ఓట్లు కూడా పడే అవకాశం లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.
మరి అసలు.. ప్రజల మధ్యకు రాకుండా మానేసిన నాయకులను బుజ్జగించో… బామాలో.. లైన్‌లో పెట్టుకోకుండా.. డిజిటల్ టీడీపీ ద్వారా.. ఇప్పటికే యాక్టివ్గా ఉన్న వారిని మరింతగా సోమరులను చేస్తారా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
This post was last modified on July 20, 2021 11:16 am
పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…