ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెల్లుబికే లా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలను రేవంత్‌కు ఇవ్వడం ఇష్టంలేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో రేవంత్‌కు కష్టాలు తప్పవని.. పార్టీ పుంజుకోవడం కష్టమని.. పెద్ద ఎత్తున విశ్లేషణలు, విమర్శలు వచ్చాయి. అయితే.. వీటిని సవాలుగా తీసుకున్న రేవంత్.. ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ పటిష్టతకు.. నడుంబిగించారు. దీనిలో భాగంగా రేవంత్.. ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికివారు.. తమకు తామే పెద్దలమని చెప్పు కొంటారు కూడా. ఈ క్రమంలో రేవంత్‌ను గుర్తించడం కష్టమే. దీనిని గమనించిన రేవంత్.. ప్రతి ఒక్క నేతను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యంలోనే విమర్శలను పొడచూపకుండా.. ఆయన అడుగులు వేస్తున్నారు. అదేసమయంలో పార్టీని పుంజుకునేలా చేసేవారికి పార్టీని గెలిపించేవారికి.. ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతోపాటు.. గత 2018 ఎన్నికల్లో విజయం సాధించి.. తర్వాత అధికార పార్టీలో చేరి పదువులు దక్కించుకున్నవారిపై.. తనదైన శైలిలో.. రేవంత్.. రాజకీయ వ్యూహానికి తెరదీశారు.
12 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేలా అటు న్యాయ పోరాటం.. ఇటు రాజకీయంగా వారిని ప్రజాకోర్టులో నిలదీసే కార్యక్రమాలను తీవ్రతరం చేశారు. ఇక, కాంగ్రెస్‌ను సామాజిక వర్గాల వారీగా బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా.. ఇతర పార్టీల్లో ఉంటూ.. ఒకింత స్తబ్దుగా ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. పార్టీ చీఫ్ దగ్గరకు నాయకులు రావడం అనే సంప్రదాయానికి భిన్నంగా.. సమస్యలు ఉన్న చోట.. తానే ప్రత్యక్షమవడం.. నేతలను తానే కలుసుకోవడం అనే సరికొత్త సంప్రదాయానికి రేవంత్ తెరదీసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం.. పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. దీనిని బట్టి.. రేవంత్‌ను అనుసరించక తప్పని పరిస్థితి సీనియర్లలోనూ కలగడం గమనార్హం.
This post was last modified on July 20, 2021 9:43 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…