ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఆయన దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధానిని మారుస్తూ.. మూడు రాజధానులుగా నిర్ణయించారు. దీనిపై ప్రజలు, రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా సీఎంగా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా తిరిగితోడుతున్న జగన్.. రాజధాని పరిధిలోని కరకట్ట సమీపంలో చంద్రబాబు ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు.
దాదాపు 8 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధమంటూ.. జగన్ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. జగన్ దూకుడుగానే ముందుకు సాగారు. ఇక, ఇప్పుడు రాజధాని పరిధిలో మరో కూల్చివేతకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అమల్లో కూడా పెట్టేశారు.
విజయవాడ-అమరావతి రాజధానిని కలుపుతూ.. చంద్రబాబు హయాంలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ వంతెన నిర్మాణ పనులను సీఎం జగన్ ఆదేశాల మేరకు.. అదికారులు కూల్చేస్తున్నారు.
గడిచిన వారం రోజులుగా ఇక్కడ నిశ్శబ్దంగా కూల్చివేత పనులు జరుగుతుండడం గమనార్హం. ఐకానిక్ వంతెన నిర్మాణానికి సంభందించి వేసిన పునాదులను కూల్చేశారు. చంద్రబాబు హయాంలో ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ.. దీని కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దాదాపు 1327 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తాజాగా జగన్ కూల్చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
విజయవాడలోని గొల్లపూడి సమీపం నుంచి అమరావతిలోని కీలక పట్టణంగా మారనున్న ఉద్దండరాయుని పాలెం వరకు ఈ ఐకానిక్ వంతెనను నిర్మించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడం.. జగన్.. అధికారంలోకి రావడం.. చంద్రబాబు ఛాయలు లేకుండా చేయాలనే రాజకీయ వ్యూహం అనుసరించడంతో.. అమరావతిలో ఒక్కక్కటీ కూల్చివేత దిశగా సాగుతున్నాయి.
This post was last modified on July 17, 2021 4:29 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…