చంద్రబాబునాయుడును జూనియర్ ఎన్టీయార్ జెండాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు పర్యటనల్లో జూనియర్ కు జేజేలు పలుకుతు ఆయన బొమ్మున్న జెండాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా మచిలీపట్నం పర్యటనలో కూడా చంద్రబాబు ముందు వెనుక జూనియర్ జెండాలు రెపరెపలాడాయి. జూనియర్ ఎన్టీయారే కాబోయే సీఎం అంటు అభిమానులు జెండాలు పట్టుకుని నానా హంగామా చేశారు.
తన పర్యటనల్లో తనముందే ఇంత హంగామా జరుగుతున్నా అభిమానులను నివారించలేక చంద్రబాబు మౌనంగా భరిస్తున్నారు. ఆమధ్య కుప్పం నియోజకవర్గం పర్యటనల్లో కూడా చంద్రబాబుకు ఇదే విధమైన అనుభవం ఎదురైంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా హఠాత్తుగా కుప్పంలో జూనియర్ ఎన్టీయార్ బొమ్మలతో జెండాలు ఎగరేయటం ఇదే మొదలు.
ఒకవైపు చంద్రబాబు రోడ్డుషో జరుగుతున్న సమయంలో అదే రోడ్డుషోలో కాబోయే సీఎం జూనియర్ ఎన్టీయార్ అంటు అభిమానులు నినాదాలు ఇవ్వటం చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. అయినా ఏమీ చేయలేక కామ్ గా ఉండిపోయారు. విజయవాడ, ఒంగోలు, గుంటూరులో కూడా జూనియర్ బొమ్మతో పెద్ద ఫెద్ద ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఫ్లెక్సీలు వెలసినపుడల్లా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు లోకేష్ ఉన్నా పట్టించుకోకుండా జూనియర్ నే హైలైట్ చేస్తున్నారు. మరిదంతా ఎవరు చేస్తున్నారు ? పార్టీలో నేతలా ? లేకపోతే జూనియర్ సినిమా అభిమానులా అన్నదే అర్ధం కావటంలేదు. ఏదేమైనా జూనియర్ విషయం ఏదోలా పార్టీలోను, బయట జనాల్లోను పదే పదే చర్చకు వస్తుండటం చంద్రబాబుకు తలనొప్పులు తెస్తోంది.
సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళే జూనియర్ ఎన్టీయార్ రావాలని, పార్టీని కాపాడాలని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారంటనే జూనియర్ విషయంలో నేతలు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమైపోతోంది. ఇప్పటికప్పుడు జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని ఎవరు అనుకోవటంలేదు. మరిప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? అన్నదే సస్పెన్సుగా మిగిలిపోతోంది.
This post was last modified on July 15, 2021 11:29 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…