దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరగపెడుతుండటం గమనార్హం. కాగా.. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత వణికిస్తోంది.
151 శాంపిల్స్‌ను జీనోమ్ స్వీకెన్సింగ్‌కు పంపగా…138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.
బెంగాల్‌లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్‌ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్ ప్లస్ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్‌గా గుర్తించినట్లు దీప్ కుమార్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్ ప్రాంతాల్లో వారాంతపు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్‌డౌన్‌ను విధించింది. నైట్ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.
This post was last modified on %s = human-readable time difference 5:24 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…