తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన వెంటనే ఇటు టీఆర్ఎస్ వాళ్లు.. అటు కాంగ్రెస్‌లో రేవంత్ శత్రువులు.. ఇటు ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే వైసీపీ వాళ్లు.. చివరకు తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల ఇలా అందరూ ఒక్కటే డైలాగ్ కామన్‌గా అందుకున్నారు. టీ పీసీసీ కాదు టీటీడీపీ అని.. ! చివరకు కోమటిరెడ్డి అయితే ఓటుకు నోటుతో ఎలా ఓటు కొనాలని చూశాడో… అలాగే డబ్బుతో పీసీసీ కొనుక్కున్నాడని విమర్శించారు. సరే ఇదిలా ఉంటే ఈ రోజు చిట్‌చాట్‌లో రేవంత్ టీపీసీసీని టీ టీడీపీ అన్న వాళ్లకు, అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు.
నాపై విమర్శలు చేసేందుకు బావ, బావమరుదులు అయిన కేటీఆర్, హరీష్‌రావు పోటీ పడుతున్నారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ఎల్.రమణను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
కేటీఆర్‌కు పౌరుషం ఉంటే ఆంధ్రా నాయకుడు రామారావు పేరు మార్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పేరును కేడీఆర్ అని మార్చిన రేవంత్ దానర్థం కల్వకుంట్ల డ్రామారావు అని చెప్పారు. ఇక కేసీఆర్, కేటీఆర్‌ల బతుకు అంతా తెలుగుదేశం అయితే… హరీష్‌రావు బతుకు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
టీ కాంగ్రెస్ టీడీపీ అయితే.. టీఆర్ఎస్ కూడా టీడీపీనే కదా ? అని రేవంత్ లాజిక్ చెప్పారు. ఇక కేసీఆర్ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 75 శాతం తెలుగుదేశం వాళ్లు అయితే… కొందరు కాంగ్రెస్ మంత్రులు లేరా ? అని రేవంత్ ప్రశ్నించారు. వాళ్ల నాన్న ముఖ్యమంత్రి పదవి ఇవ్వట్లేదనే కేటీఆర్ బాధపడుతున్నారని… హరీష్ కు 2004లో కాంగ్రెస్ రాజకీయ బిక్ష పెడితే.. 2009లో కేటీఆర్‌కు తెలుగుదేశం రాజకీయ బిక్ష పెట్టిందని రేవంత్ చెప్పారు.
This post was last modified on July 10, 2021 10:05 am
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…