చెప్పుకోవటానికి 100 ఏళ్ళని ఘనంగా చాటుకుంటారు. నిజంగా పార్టీలో నేతలంతా కలిసికట్టుగా ఉంటే అది మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపించేదే. ఇదే సమయంలో 100 ఏళ్ళు దాటడంతో పార్టీకి వయసైపోయిందని, ఔట్ డేటెడ్ అయిపోయిందని ప్రత్యర్ధులు చెణుకులు విసురుతుండటం అందరు చూస్తున్నదే. ఇదంతా ఏ పార్టీ గురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది, అవును జాతీయ పార్టీ కాంగ్రెస్ గురించే.
చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో అంతే బలహీనమైపోయింది. తాజాగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన రేవంత్ రెడ్డి విషయమే తీసుకుందాం. అధిష్టానం రేవంత్ ను అధ్యక్షునిగా నియమించిందో లేదో వెంటనే అసమ్మతి మొదలైపోయింది. అదికూడా బలమైన రెడ్డి సామాజికవర్గం నుండే మొదలు కావటం మరీ విచిత్రం. పీసీసీ కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలు బాహాటంగానే రేవంత్ పై తమ వ్యతిరేకతను ప్రకటించేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ విషయంలో కాదు ఎవరిని పీసీసీ అధ్యక్షుడిని చేసినా వాళ్ళకి అసమ్మతి సెగ తప్పదు. కోమటిరెడ్డిని చేసినా అసమ్మతుంటుంది, జీవన్ రెడ్డిని చేసిన అసమ్మతి తప్పదు. నేతలెవరైనా కానీ అసమ్మతి అన్నది కామన్. కాకపోతే అసమ్మతి అనేది అసంతృప్త నేతల సామర్ధ్యంపైన ఆధారపడుంటుంది. బలమైన నేత అసంతృప్తిగా ఉంటే అసమ్మతి ఎక్కువ రోజులుంటుంది.
విచిత్రమేమిటంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నేతల్లో గ్రూపు రాజకీయాలు ఒకేలా ఉంటాయి. ఒక విధంగా చూస్తే గ్రూపు రాజకీయాలే కాంగ్రెస్ బలమూ+బలహీనత కూడా. ఇది కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ వరకు బాగా అర్థం చేసుకున్నది. అందుకే ఎవరిని చేసినా అసమ్మతి అనేది తప్పనప్పుడు… పార్టీకి ఉపయోగపడే స్ట్రాంగ్ లీడర్ ను ఎంచుకుంటే ఉపయోగం కదా అన్న ఆలోచన నుంచే రేవంత్ రెడ్డికి ఎంట్రీ దొరికింది.
ప్రస్తుతం అసమ్మతి వ్యక్తంచేస్తున్న నేతలంతా కేసీఆర్ ట్రాప్ లో పడి తెలంగాణ ఇవ్వండి మన పార్టీ రేంజ్ ఏంటో చూపిస్తాం అని ప్రగల్బాలు పలికి పార్టీని నేలకు దించారు. ఈ అసమ్మతి నేతల సామర్థ్యం కేసీఆర్ ను ఎదుర్కోలేకపోవడంతోనే ప్రూవ్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ లో జనాదరణ ఉన్న లీడరు రేవంత్ రెడ్డి అన్నది అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ కు పగ్గాలిస్తేనే టీఆర్ఎస్ కు గట్టి పోటీ అని నమ్మిన కాంగ్రెస్ అధిష్టానం మిగతా సీనియర్లను పక్కన పడేసింది.
రేవంత్ నాయకత్వంలో నడిస్తే కాంగ్రెస్ నేతలు అధికారం అనుభవిస్తారు, లేదంటే ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వస్తుందని జనం కూడా విశ్లేషిస్తున్నారు. మరి ఈ అసమ్మతి నేతలు పార్టీలో ఉంటారా? పోతారా? అన్నది కాలమే చెప్పాలి.
This post was last modified on July 8, 2021 10:32 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…