మాజీ మంత్రి అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆమె భర్త కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదైంది.
నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో భార్గవ్ రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది.
అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి భార్గవ్ రామ్ సర్టిఫికెట్ అందించారు. ఈనెల 1న ఆయన నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు భార్గవ్ రామ్‌పై అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు.
అయితే కొవిడ్ సర్టిఫికెట్లను బోయిన్‌పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్ ఇచ్చిన ఆస్పత్రిలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్, రత్నాకర్, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.
This post was last modified on July 7, 2021 12:27 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…