టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ లో ఎంతో మంది నేతలు ఎన్నో ఆశలతో పార్టీలో చేరినా ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఈ లిస్టులోనే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మహేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎటు తేల్చుకోలేక సంకట స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డే కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిపై గెలిచారు.
అయితే గత ఎన్నికల్లో తాండూరులో మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ నేత ఫైలెట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ కారెక్కించేసుకున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను తన ఇష్టం వచ్చినట్టుగా శాసించారు. అప్పట్లో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో మహేందర్ రెడ్డికి పెద్ద యుద్ధమే నడిచింది. ఈ క్రమంలోనే విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లి పట్టుబట్టి మరీ మహేందర్ రెడ్డిని ఓడించారు. అయితే మహేందర్ రెడ్డి పై గెలిచిన రోహిత్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో పాటు కేటీఆర్‌కు అత్యంత క్లోజ్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరులో రోహిత్‌రెడ్డిని కదిపే ప్రశక్తే లేదు.
దీంతో ఇంత సీనియార్టీ ఉండి కూడా మహేందర్‌రెడ్డికి ఇప్పుడు నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. పైగా గ్రేటర్ పరిధిలోని పటాన్‌చెర్వు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల మీద దృష్టిపెడుతున్నా అక్కడ ఎమ్మెల్యేలు మహేందర్‌ను రానివ్వడం లేదు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా సరికొత్త ఆలోచన చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం రేవంత్‌తో ఉన్న విబేధాలు పక్కన పెట్టి రేవంత్‌తో చేతులు కలుపుతారని అంటున్నారు. తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి పార్టీ మారినా కూడా కేడర్ చెక్కు చెదర్లేదు.
ఇప్పుడు మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే అక్కడ కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థి అవుతాడు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా అన్న వెంటే నడిచినా .. అప్పుడు కొండగల్లో రేవంత్, తాండూరులో మహేందర్ రెడ్డి పోటీ చేస్తారట. నరేందర్ రెడ్డికి మరో సీటు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on July 6, 2021 6:16 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…