మాండ్య ఎంపీ, నటి సుమలత పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నోరు జారారు. కావేరీ నదిపై కృష్ణసాగరాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీకు అవుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. గత కొంతకాలంగా.. సుమలత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కుమార స్వామి స్పందించారు.
జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే… అడ్డుగా… ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ.. కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మైసూరు చక్కెర కర్మాగారం అంశంపై జేడీ (ఎస్) ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కేఆర్‌ఎస్ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచూ ఆరోపిస్తున్నారని అన్నారు. జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని మాజీ సీఎం ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు.
‘ఆమె లాంటి ఎంపీని మాండ్యా ఎప్పుడూ చూసి ఉండదు.. భవిష్యత్తులో ఆమె లాంటి వారు.. ఆమె సానుభూతితో గెలిచారు.. ఆమెకు మరో అవకాశం రాదు కాబట్టి ఆమె సరిగ్గా పనిచేస్తే మంచిది’ అని వ్యాఖ్యానించారు.
మాండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత.. కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ అక్కసుతోనే కుమారస్వామి ఇలా మాట్లాడాడంటూ విమర్శలు కూడా వినపడుతున్నాయి. మరి తన మాటలను ఆయన వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి.
This post was last modified on July 6, 2021 2:13 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…